Uttarakhanda telugu women save to 25 members flood victims

uttarakhanda flood victims, telugu people, telugu women save, telugu women saree, 25 members flood victims save, telugu women in krishna district,

uttarakhanda : telugu women save to 25 members flood victims

తన చీరతో 25 మంది కాపాడిన మహిళ?

Posted: 06/26/2013 11:18 AM IST
Uttarakhanda telugu women save to 25 members flood victims

కళ్లముందు ముంచుకొస్తున్న వరద ప్రమాదం.. అప్పటికే కొంతమంది వరదలో కొట్టుకుపోయారు. తమ ప్రాణాలు కూడా వరదలో కలిసిపోవాల్సిందేనని అక్కడున్నావారు దేవుడి భారం వేసి, ఆశలు వదులుకున్నారు. ఈ వరద నుండి ఎలాగైన ప్రాణాలతో బయటపడాలి అనే సంకల్పమే ఆమె చేత ప్రయత్నం చేయించింది. ఆమె ప్రయత్నం ఫలించి .. మరో 25 మంది ప్రాణాలను కాపాడగలిగింది. ఆమె కట్టుకున్న చీరే అందరి ప్రాణాలు కాపాడింది. కృష్ణా జిల్లాకు చెందిన పద్మజ బృందం గౌరీకుండ్‌లో ఒక మూడంతస్తుల భవనంలో బసచేసింది. భారీ వరద ఒక్కసారిగా రావడంతో చూస్తుండగానే రెండు అంతస్తులు మునిగిపోయాయి. ఆమె ముందు పదిమంది కొట్టుకుపోయారు. భవంతి క్రమంగా ఒరిగిపోతోంది. కింద ఉన్నవారంతా జలసమాధి అయిపోయారు. దీంతో పద్మజ ధైర్యం చేసి తన చీరనే తాడుగా కట్టుకుని ఆ భవనం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న వారంతా ఆమెను అడ్డుకున్నారు. వరద ధాటికి కొట్టుకుపోతావంటూ ఆపే ప్రయత్నం చేసినా ఆమె ఆగలేదు. చీర సాయంతోనే కిందకు దిగి తప్పించుకుంది. ఆమె ధైర్యంగా వరదను దాటడంతో అక్కడ ఉన్న 25 మంది కూడా పద్మజ చీరను పట్టుకుని దిగి.. వరద నుంచి తప్పించుకున్నారు. ఆమె దైర్యానికి అందరు మెచ్చుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles