Sabita reddy in jagan case

Sabita Reddy in Jagan case, ex-home minister, cbi court, nampally court

Sabita Reddy in Jagan case, ex-home minister, cbi court, nampally court

నేడు కోర్డుకు హాజరుకానున్న సబిత

Posted: 06/07/2013 09:04 AM IST
Sabita reddy in jagan case

మొన్నటి వరకు ఆమె హోం మంత్రి ఆమె ముందు పోలీసు బాసులు కూడా సలాం కొట్టాల్సిందే. ఆమె వస్తుందంటే పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ వేరు, ఆమె పోలీసులకు బాస్ కాదు.... కోర్డులో హాజరవుతున్న ముద్దాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఎ4 నింధితురాలిగా మారిన సబితా ఇంద్రారెడ్డి నేడు ఆ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతుంది. దాల్మియా సెమెంటులో పెట్టుబడుల వ్యవహారం పై ధాఖలు చేసిన ఛార్జిషీట్ లో సబితను ఎ4 నింధుతిరాలిగా చేర్చిన విషయం తెలిసిందే.  కడప జిల్లా మైలవరం మండలంలో 407 హెక్టార్ల సున్నపురాతి నిక్షేపాలను 1996లో జయమినరల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా, వాటిని ఈశ్వర్ సిమెంట్స్ ద్వారా దాల్మియాకు బదిలీ చేసిన వ్యవహారంలో సబితకు సంబంధం ఉందని సీబీఐ అభియోగాలు మోపింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. శుక్రవారం హాజరుకావాలని సబితకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టుకు రానున్నారు. చేవెళ్ల చెల్లెమ్మగా పేరొందిన సబిత కొర్టు మెట్లెక్కిరావడం బాధకరం అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles