Ed adjudicating on jagan s properties attached

ys jagan, ed, cbi probe, ramky, YSR Congress party, Jagati publications

Enforcement directotare (ED) has attached YSR Congress party YS Jagan's properties second time. ED has attched 143.74 crores value properties.

జగన్ కి షాక్ ల మీద షాక్

Posted: 06/06/2013 07:44 PM IST
Ed adjudicating on jagan s properties attached

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కు ఈడీ (ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) షాక్ ల మీద షాకులు ఇస్తుంది. ఈ ఏడాది జనవరిలో జగన్ కేసుకు సంబంధించి రూ.143.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ మేరకు ఈడి అప్పుడు ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు వైయస్ జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఇప్పుడు రూ.143.74 కోట్లను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జప్తు చేసిన వాటిలో రాంకీ గ్రూపుకు చెందిన 133.74 కోట్లు, జగన్ పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఆస్తులను అటాచ్‌మెంట్ చేయడం సబబేనని న్యాయప్రాధికార సంస్థ ద్రువీకరించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే ఈ అక్రమాలు జరిగినట్లు న్యాయప్రాధికార సంస్థ నిర్ధారించింది. దీంతో జగన్ కి మరో షాక్ తగిలినట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles