Trs training camp in fighting

TRS Training Camp in Fighting, Nizamabad, kamareddy, MLA Gampagoverdhan, tirumala reddy fractions, stampede, clashes in trs training camp, suryapet, nalgonda district, same scene repeated, jagadiswar reddy, injure ramesh taken to hospital, senior leaders condemned

TRS Training Camp in Fighting, Nizamabad, kamareddy, MLA Gampagoverdhan, tirumala reddy fractions, stampede, clashes in trs training camp, suryapet, nalgonda district, same scene repeated, jagadiswar reddy, injure ramesh taken to hospital, senior leaders condemned

టీఆర్ఎస్ వాళ్ళు కుమ్మేసుకున్నారు

Posted: 05/28/2013 09:09 PM IST
Trs training camp in fighting

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో నిర్వహించిన శిక్షణ శిబిరం కాస్త రసాభసగా మారింది. వేదిక సాక్షిగా ఇరువర్గాల వారు బాహీ బాహీకి దిగారు. కామారెడ్డికి చెందిన గంప గోవర్థన్ వర్గీయులు ఓ వైపు సమావేశం జరుగుతుండగానే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ వర్గీయులు,పార్టీ నాయకులు ఎం.జి. వేణుగోపాల్‌గౌడ్, తిర్మల్‌రెడ్డిల అనుచరులు నానా హంగామా చేశారు. పార్టీ పదవులను పాతవారికి కాకుండా ఎమ్మెల్యే తన అనుచరులకే ఇస్తున్నారని వేణుగోపాల్ గౌడ్ ఆరోపించారు. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి న్యాయం జరగడం లేదన్నారు. 12ఏళ్లుగా పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసినా తమను ఎందుకు దూరంగా ఉంచుతున్నారని అన్నారు. దీంతో అక్కడ మాటా మాట పెరిగి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎదుటే ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఓ అరగంట పాటు శిక్షణ శిబిరంలో గందరగోళం నెలకొంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, ఇరువర్గాల వారిని చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించి వేయడంతో.. గొడవ కాస్త సద్దుమణిగింది. ఇరు వర్గాల సమస్యను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా స్వామిగౌడ్ వారికి హామీనిచ్చారు. శిక్షణ శిభిరం కొట్లాట శిభిరంగా మారడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవమానానికి గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles