Pervert who put chastity lock on wife gets 10 years in jail

chastity lock, chastity lock on wife, Sohanlal, cruel, self-devised, out surgery on his wife

Pervert who put chastity lock on wife gets 10 years in jail

భార్య శీలానికి తాళం? జైలుకు వెళ్లిన భర్త..?

Posted: 05/18/2013 05:37 PM IST
Pervert who put chastity lock on wife gets 10 years in jail

అనుమానంతో మెకానిక్ భర్త, భార్య మర్మావయవానికి పెద్ద తాళం వేసి జైలు వెళ్లటం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమె మర్మావయవానికి ‘ఇనుప కచ్చడం’ వేసి, క్రూరంగా హింసించిన ఓ ప్రబుద్ధుడికి పదేళ్ల కఠినజైలు శిక్ష పడింది. సోహన్‌లాల్(38)అనే సదరు ఉన్మాదికి ఇక్కడి అదనపు సెషన్స్ కోర్టు జడ్జి అవనీంద్ర కుమార్ సింగ్ ఈ శిక్ష వేశారు. ఐపీసీలోని సెక్షన్ 498(భార్యపై క్రూరత్వం), సెక్షన్ 326(తీవ్రంగా గాయపర్చడం) కింద అతన్ని దోషిగా తేల్చి రూ.వెయ్యి జరిమానా కూడా విధించారు.

ఈ కేసులో తొలుత సోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చిన అతని భార్య విచారణలో మాట మార్చింది. అయితే జడ్జి అది పట్టించుకోకుండా, వైద్యుడి వాంగ్మూలం, సాక్ష్యాల ఆధారంగా శిక్ష వేశారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. మెకానిక్ అయిన సోహన్‌లాల్ భార్యపై అనుమానంతో ఆమె జననాంగానికి తాళం వేశాడు. దీని కోసం మొరటు పద్ధతిలో సర్జరీ కూడా చేశాడు.

తాను ఇంటినుంచి బయటకు వెళ్లే ప్రతిసారీ ఆ తాళం వేసి వెళ్లేవాడు. నాలుగేళ్లకు పైగా ఈ అమానుషాన్ని కొనసాగించాడు. దీంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. బాధ భరించలేక గత జూలైలో ఎలుకల మందు పుచ్చుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు చికిత్స చేసిన వైద్యురాలు విభాతాళాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నాలుగేళ్ల కిందట భర్త తనకు మత్తుకోసం బలవంతంగా నల్లమందు తినిపించి తాళం బిగించినట్లు బాధితురాలు చెప్పిందని విభా కోర్టుకు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles