What is the real age of manmohan singh

prime minister manmohan singh, manmohan singh, embarrassment, rajya sabha from assam, rajya sabha elections in 2007 and 2013, pmo website, real age of manmohan singh

what is the real age of manmohan singh

మన్మోహన్ అసలు వయసెంత?

Posted: 05/18/2013 10:12 AM IST
What is the real age of manmohan singh

అమ్మాయిల వయస్సు , మగవారి జీతం గురించి అడగరాదని మన పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఈ కోవలోకి రాజకీయ నాయకులు చేరిపోయారు. రాజకీయ నాయకుల సంపాదన, వయస్సు అడగరాదని అంటున్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేసిన మన దేశ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ గారు తన వయస్సు విషయంలో సిగ్గుపడ్డారు. అంటే ఆయనికి ఇటీవలే ఓటర్ కార్డు వచ్చినంతగా మన్మోహన్ జీ ఫీలయ్యాడని రాజకీయ నాయకులు అంటున్నారు.

ఇప్పుడు అందరి కళ్లు ప్రధాని వయస్సు మీద పడ్డాయి. ఇప్పుడు ఆయన వయస్సు ఎంత? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఎన్నేళ్లు? 80 ఏళ్లా? 82 ఏళ్లా? ఇదేదో విపక్షాలు వేస్తున్న ప్రశ్న కాదు. స్వయంగా ఆయన వెల్లడించిన వివరాలే ఈ సందేహాన్ని లేవనెత్తుతున్నాయి. అస్సాం నుంచి రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ వేసిన ఆయన అఫిడవిట్‌లో తన వయసు 82 ఏళ్లని పేర్కొన్నారు.

2007లో రాజ్యసభ ఎన్నికల కోసం ఆయన సమర్పించిన అఫిడవిట్ ఇది నిజం కాదంటోంది. ఆ అఫిడవిట్‌లో తనకు 74 ఏళ్లని తెలిపారు. ఆ ప్రకారం ఆయనకు 80 ఏళ్లు దాటాయి. మన్మోహన్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఆయన పుట్టిన తేదీ సెప్టెంబర్ 16, 1932కు ఈ లెక్క సరిపోతుంది. ప్రధానిని ఈ వ్యవహారం ఇబ్బందికి గురిచేసే అవకాశముంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles