Vijayamma challenges cm kiran

ys vijayamma, kiran kumar reddy, power cut, ysr congress

YSR Congress Party honorary president YS Vijayalaxmi has challenged CM Kiran Kumar Reddy on power cuts in Andhra Pradesh

vijayamma challenges cm kiran.png

Posted: 03/25/2013 01:57 PM IST
Vijayamma challenges cm kiran

kiran-vijayammaముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం అసెంబ్లీలో బహిరంగ సవాల్ విసిరారు. ప్రస్తుతం విద్యుత్ కోతల పై అసెంబ్లీలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై మాట్లాడిన వైయస్ విజయమ్మ కిరణ్ కమార్ రెడ్డి విద్యుత్ కోతల వల్ల రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ ఆయన సొంత నియోజకవర్గం పీలేరులోనే పంట ఎండిపోయినట్లు తాము నిరూపిస్తామని, అందుకు కిరణ్ సిద్ధమా అని విజయమ్మ సవాల్ చేశారు. రాష్ట్రంలో చాలా పంట ఎండిపోయిందనే విషయం ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. కాగా వామపక్షాలతో కలిసి విద్యుత్ సమస్యపై పోరాడతామని, ప్రజా సమస్యల విషయంలో పోరాడటంలో వైయస్సార్ కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని ఆమె చెప్పారు. గతంలో కూడా వామపక్షాలతో కలిసి విద్యుత్ ఆందోళన చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మరి విజయమ్మ సవాల్ కి కిరణ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dmdk mlas suspended one year
Chandrababu padayatra ends on 27th april  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles