Dmdk mlas suspended one year

vijayakanth, jayalalitha, dmdk, tamilnadu, chennai

Six opposition DMDK MLAs were today suspended from the Tamilnadu Assembly for one year in connection with the assault on a dissident DMDK legislator inside the house

dmdk mlas suspended one year.png

Posted: 03/25/2013 06:49 PM IST
Dmdk mlas suspended one year

vijaykanthప్రజా ప్రతినిధుల ఆగడాలు రోజు రోజుకు మించి పోతున్నాయనడానికి ఇదో ఉదాహారణ. మొన్నటి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఓ పోలీసు అధికారిని చితకబాధిన సంఘటనలో ఆ ఎమ్మెల్యేల పై మహారాష్ట్ర స్పీకర్ వారి పై ఏడాది చివరి వరకు వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు తమిళనాడు అసెంబ్లీలో సినీనటుడు, రాజకీయ నాయకుడు అయిన విజయకాంత్ డిఎండికె పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల పై స్పీకర్ ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేశారు. గతేడాది తమిళనాడు ఎన్నికల్లో డిఎండికె పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేల్లో కొందరు అధికార పార్టీ అన్నాడిఎంకె వైపు వెళ్లారు. అందులో మైఖేల్ రాయప్పన్ ఉన్నారు. ఆయనపై డిఎండికె సభ్యులు విసి చంద్రకుమార్, కె నల్లతంబి, డి మురుగేశన్, ఎస్ సెంథిల్ కుమార్, బి పార్థసారథి, ఆర్ అరుల్ సెల్వన్‌సభ్యులు సభలోనే దాడి యత్నం చేశారు. దీంతో స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో విజయ్ కాంత్ పార్టీకి షాక్ తగిలింది. స్పీకర్ సస్పెండ్ చేస్తే...ఎమ్మెల్యేలకు ఈ సంవత్సరం పాటు జీతాలు ఉండక పోవడమే కాకుండా ఇతర అలవెన్సెస్ కూడా ఉండవు. మరి ఇలాంటి చర్యలు మరే ఇతర అసెంబ్లీలో ఉండేందుకు ఇవి ఉపయోగ పడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul sharma charged with drug use in rave party
Vijayamma challenges cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles