Us senate proposal liberalize h1 b visa proceedure

us visa, h1-b visa, senate, house of representatives, techies from us universities, indian companies, facebook, google, microsoft

us senate proposal liberalize h1-b visa proceedure

h1-b-visa-unlimited.png

Posted: 03/21/2013 04:55 PM IST
Us senate proposal liberalize h1 b visa proceedure

h-1b-amendment

సెనేట్ ఇమ్మిగ్రేషన్ ప్లాన్ ద్వారా హెచ్-1బి వీసాల జారీని రెట్టింపు చేద్దామని అమెరికా ప్రతిపాదన.   ఈ నిర్ణయం వలన ఇండో అమెరికన్ సాంకేతిక నిపుణులకు లాభం చేకూరుతుంది కానీ భారతీయ సంస్థలకు కాదు.  ఈ ప్లాన్ వలన అమెరికా విశ్వవిద్యాలయాల్లో సైన్స్, సాంకేతిక విద్యలు, ఇంజినీరింగ్, గణిత శాస్త్రాలలాంటి ఉన్నత విద్యలను అభ్యసించిన విదేశీయులు వారికంటూ చట్టబద్ధమైన ప్రతిపత్తితో అపరిమితమైన సంఖ్యలో అమెరికాలోకి రావటానికి వీలుగా ఈ సెనేట్ ఇమ్మిగ్రేషన్ ప్లాన్ రూపొందించబడింది.  దీనివలన అమెరికాలోకి హెచ్-1 బి వీసాలతో ప్రవేశించే సాంకేతిక విద్యా నిపుణుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా.  ప్రస్తుతం సంవత్సరానికి 65 వీసాల వరకే పరిమితి ఉంది.  

ఈ ప్రతిపాదన రెండు సభల్లోనూ, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ లో కూడా ఆమోదం పొందగలిగినట్లయితే, అమెరికా దేశంలోని పెద్ద పెద్ద సంస్థలైన ఫేస్ బుక్, మైక్రోసాప్ట్, గూగుల్ లాంటి వాటిలో ఉన్న కొరత తీరిపోతుంది.  వారికి కావలసినంత మంది ఉన్నత విద్యనభ్యసించిన ఉద్యోగులు లభిస్తారు.  ప్రపంచం మొత్తంలో అటువంటి ఉన్నత విద్యను అభ్యసించి అర్హతలు కలిగినవాళ్ళల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి వారికి అవకాశాలు ఎక్కువుంటాయని అంటున్నారు.  

భారతీయ సంస్థలకు దీని వలన ప్రయోజనం ఉండకపోవటానికి కారణమేమిటంటే, ఈ వారం సెనేటర్ చిక్ గ్రాస్లీ ప్రతిపాదించిన నియమం ప్రకారం హెచ్ 1-బి కోసం అర్జీ పెట్టుకునే సంస్థలు 50 మంది లేక అంతకంటే ఎక్కువ మంది అమెరికన్ జాతీయ ఉద్యోగులున్నంత మాత్రాన సరిపోదు.  ఉద్యోగులలో 50 శాతం కంటే తక్కువ మంది మాత్రమే హెచ్ 1-బి,  ఎల్ వీసాలు గల ఉద్యోగులున్నారని ఆ సంస్థలు ప్రకటించాల్సివుంటుంది.  

ప్రతిపాదించిన ఈ వీసా నియమం వలన అమెరికాలోని అతిపెద్ద సంస్థలకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇది ఎలాగైనా పాసవాలని ఆయా సంస్థల ప్రతినిధులు లాబీయింగ్ చేస్తున్నారని కూడా వార్తలు అందుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us proposal against srilanka passed in human rights commistion
Terrorists ataack on re habitation camp in peshavar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles