Taran taran police men suspended

taran taran punjab police, atrocities on women, women harassment

taran taran police men suspended

women-victims.png

Posted: 03/05/2013 10:35 AM IST
Taran taran police men suspended

punjab-police-harrassement

కంచే చేను మేసిన చందాన శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులు కూడా మహిళల మీద అసభ్యంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళిక ఎవరికి చెప్పుకోవాలి. 

పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్ కి 300 కి.మీ దూరంలో ఉన్న తరన్ తరన్ లో మహిళను హింసించిన పోలీసుల దుశ్చర్యలను కెమేరా లెన్స్ భద్రపరచబట్టి వాళ్ళు దొరికి సస్పెన్షనకు గురయ్యారు.  కానీ వెలుగు చూడని ఇతర కేసుల మాటేమిటి.  బయటకు చెప్తే చూడు అంటూ బెదిరించి నోళ్ళు మూయించి ఉదంతాలెన్నో లెక్కకు తేలవు.  చెప్పినట్టు చెయ్యకపోతే ఇంట్లో వాళ్ళ పెద్దలూ పిన్నలకు ఏమవుతుందోననే భయం వాళ్ళ నోళ్ళను నొక్కేస్తుంటాయి.  ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళల గోడు ఎవరికీ చెప్పుకోలేనిది, తమ కన్నీరు తామే దిగమింగుకోవలసిన పరిస్థితి.  చిన్నా చితకా నాయకులతోనూ మీడియా ప్రతినిధులతో వాళ్ళు అప్పుడప్పుడూ తమ కష్టాలు వివరిస్తారు.  కానీ అది అంతటితో ఆగిపోతుంది. 

లారీ డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించినందుకు పోలీస్ రిపోర్ట్ ఇవ్వటానికి వచ్చిన మహిళను స్త్రీ అని లెక్కచెయ్యకుండా, ఆమె తండ్రిని వయసు మళ్ళినవాడని చూడకుండా తరతరన్ పోలీసులు ఇద్దరు, వారిపట్ల జాలి కరుణ లేకుండా విరుచుకుపడ్డారు.  కెమేరాలో నమోదు అవటంతో విషయం బయటకు వచ్చింది.  ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక మనిషి తన సెల్ ఫోన్ ద్వారా జరిగినదంతా వీడియో రికార్డ్ తీసి టివి ఛానెల్స్ కి ఇవ్వటంతో విషయం బయటకు పొక్కింది.  ట్రక్ డ్రైవర్ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అని ఆ మహిళ ఫిర్యాదు చేస్తుంటే ముగ్గురు నలుగురు పోలీసులు ఆమెను చెంపదెబ్బ కొట్టటమే కాక తోసి కిందపడేసి కర్రతో కొట్టటం చేసారు.  ఆమె పోలీస్ స్టేషన్ కి వంటరిగా పోలేదు.  తోడుగా ఆమె తండ్రి కూడా ఉన్నాడు.  పెద్ద వయసులో ఉన్నా కాని లెక్కచెయ్యకుండా అతన్ని కూడా కొట్టి కింద పడేసారు అక్కడున్న పోలీసులు.  ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మాత్రం అలాంటిదేమీ జరగలేదని బుకాయించారు. 

కానీ సెల్ ఫోన్ రికార్డ్ మూలంగా పట్టుబడ్డ పోలీసులను సస్పెండ్ చేసారు పంజాబ్ డైరెక్టర్ జనరల్ సుమేధ్ సింగ్ సైనీ.  పూర్తి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షంచాలంటూ పంజాబ్ ఉప ముఖ్యమంత్రి బాదల్ డిజిపిని కోరారు.  పోలీసుల అకృత్యాలను, ముఖ్యంగా మహిళల పట్ల ఇటువంటి ప్రవర్తనను సహించేది లేదని గట్టిగా చెప్పారాయన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gang rape victim honored international courageous women award
Senior actress raja sulochana dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles