Senior actress raja sulochana dead

actress raja sulochana, nt rama rao, akkineni nageswara rao, shivaji ganeshan

senior actress raja sulochana dead

rajasulochana-dead.png

Posted: 03/05/2013 09:55 AM IST
Senior actress raja sulochana dead

raja-sulochanaఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రఖ్యాత నటి, నర్తకి రాజసులోచన ఈరోజు చెన్నైలో తన స్వగృంలో మరణించారు. 

ఆగస్టు 15, 1935 లో విజయవాడలో జన్మించిన రాజసులోచన 1953 లో కన్నడ సినిమా ద్వారా సినీరంగంలో ప్రవేశించి, అచిర కాలంలోనే తెలుగు, తమిళ, మళయాళ చిత్రాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావు, రాజ్ కుమార్, శివాజీ గణేషన్, ఎమ్ జి రామచంద్రన్ వంటి అగ్రనటుల సరసన సినిమాల్లో పనిచేసి చక్కని నటిగా, నర్తకిగా పేరు తెచ్చుకున్నారు.  ఆమె చేసిన  మొత్తం 274 చిత్రాల్లో రాజసులోచన గుర్తింపు తెచ్చుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి.  ప్రముఖ పాత్రల్లో, నర్తకిగా, నటిగా, విభిన్న పాత్రధారణ చేసి, ప్రేక్షకలోకాన్ని మెప్పించిన రాజసులోచన తన 77 వ సంవత్సరంలో మరణించారు.  ఆమెకు ఇద్దరు కూతుళ్ళున్నారు. 

ప్రముఖ దర్శకుడు సిఎస్ రావుని వివాహమాడిన రాజసులోచన, 1963 లో చెన్నైలో నృత్యకళా కేంద్రాన్ని స్థాపించి, దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చి కళకు సేవ చేసుకున్నారు.  raja-sulochana-dead

రాజసులోచన మరణానికి ఆమె కుటుంబ సభ్యులకు సినీ, రాజకీయ ప్రముఖులంతా తమ సంతపాన్ని తెలియజేసారు.  రేపు చెన్నైలో రాజసులోచన అంత్యక్రియలు జరుగనున్నాయి.  దానికి అలనాటి అగ్ర సినీ నటులు హాజరుకానున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles