Another suicide telangana

telangana, nalgonda, suicide, Gandamalla Ramulu, Bhongir

A suicide has been taken place for Telangana cause at Bhongir of Nalgonda district. A reporter Gandamalla Ramulu commited suicide for Telangana.

another suicide telangana.png

Posted: 01/30/2013 11:00 AM IST
Another suicide telangana

telanganaతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై కేంద్రం జాప్యం చేస్తూ పోతూనే ఉంటే, మరో వైపు తెలంగాణ లో రాష్ట్ర సాధన కోసం బలిదానాలు మాత్రం ఆగడం లేదు. ఈనెల 28వ తేదీన తెలంగాణ రాష్ట్రం పై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పిన కేంద్రం మాటమార్చి మరింత జాప్యం చేయడంతో తెలంగాణ రాదని కలత చెందిన ఓ విలేఖరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా భువనగిరిలో గంధమల్ల రాములు గౌడ్ (38) అనే విలేకరి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భువనగిరి పట్టణ శివారులో.. ద్విచక్రవాహనంపై వేగంగా దూసుకువెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. జనవరి 28న ప్రకటన చేస్తామని తెలిపి, టీ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేస్తుండటంతో ఇక తెలంగాణ రాదు అని తేలిపోయింది. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. జై తెలంగాణ' అని రాసిపెట్టుకున్న సూసైడ్ నోట్ అతడి ప్యాంటు జేబులో లభించింది.

రాజాపేట మండలం చల్లూరుకు చెందిన రాములుగౌడ్ 9న్యూస్ అనే పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. భార్య సత్యలక్ష్మి, కూతురు నందిని, కుమారుడు తరుణ్‌లతో కలిసి.. యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేటలో అత్తవారింట్లో నివాసముంటున్నాడు. కళాకారుడిగా, రచయితగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహ రించేవాడు. కాగా.. రాములు మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, రాజకీయ జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య భువనగిరి ఆసుపత్రికి వెళ్లి అతడి భౌతిక కాయాన్ని సందర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles