Phailin cyclone news updates

Phailin Cyclone news updates, Cyclone Phailin, Cyclone Phailin live news, Cyclone Phailin effects,

Phailin Cyclone news updates

అల్లకల్లోలంగా సముద్రం- కూలిన రక్షణ గోడ

Posted: 10/12/2013 01:28 PM IST
Phailin cyclone news updates

ఫైలిన్ పెను ధాటికి..సముద్రం అల్లకల్లోలంగా మారింది. కృష్ణా జిల్లా కృత్తి వెన్ను మండలం, పెదగొల్లపాలెం బీచ్ లో సముద్ర అలలు 15 అడుగుల ఎత్తులో లేస్తున్నాయి. పరిస్థితి భయానకంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను తగ్గేదాకా సముద్రంలో వేటకు వెళ్లకూడదని మత్య్సకారులను హెచ్చరించారు.

 

ఫైలిన్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఉన్నతాధికారులతో సిఎం కిరణ్ ఫోన్ లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సిఎస్ మహంతికి ఆదేశాలు జారీ చేశారు.

 

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాల సహాయం తీసుకోవాలని సూచించారు. తుపాను నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు. 850 సురక్షిత ప్రదేశాలను గుర్తించారు. ఇప్పటికే 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సహాయక చర్యలపై సిఎం మరోసారి సమీక్ష జరపనున్నారు.

 

కూలిన రక్షణ గోడ

ఫైలిన్ తుపాను ధాటికి అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో భీమిలి బీచ్ వద్ద 80 అడుగుల మేర రక్షణ గోడ కూలిపోయింది. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇసుక బస్తాలు వేసి రక్షణ గోడను నిర్మిస్తున్నారు.

 

ఇళ్లు నేలమట్టం

ఫైలిన్ తుపాను తన ప్రతాపం చూపెడుతోంది. విశాఖ శివసాయినగర్ లో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో పదుల సంఖ్యలో మత్య్సకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరం భారీగా కోతకు గురైంది. మత్య్సకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తీరాన్ని చిన్నాభిన్నం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తుపాను బీభత్సం సృష్టించడంతో మత్య్సకారులు భయాంతో వణికిపోతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles