Sheila dikshit feels ashamed

sheila dikshit, new delhi, rape, women, crime, police, capital punishment

Delhi Chief Minister Sheila Dikshit said that personally she wants death penalty for rapists.

Sheila Dikshit feels ashamed.png

Posted: 12/22/2012 09:29 AM IST
Sheila dikshit feels ashamed

sheila_dikshitఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ టీవీ ఛానల్ తో ఈ ఘటన పై మాట్లాడిన ఆమె ఆ అమ్మాయి మధ్య తరగతికి చెందినదని, ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ పూడ్చలేరని, ఆ కుటుంబ సభ్యులు కోపాన్ని అణగదొక్కుకొని ఉంటున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఆ అమ్మాయిని కాపాడటానికి తాను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఒక ముఖ్యమంత్రిగా ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నానని, తాను ఎన్నికల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని, ఎన్నికలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి... కానీ మానవత్వం అనేది ఎల్లప్పుడు నిలిచి ఉంటుందని, ఈ చర్య సమాజం తలదించుకునే విధంగా ఉందని అన్నారు. ఇక బాలిక పరిస్థితి క్షీణిస్తున్నట్లు సమాచారం. ఈమె కోసం ఢిల్లీ ప్రజలు రోడ్డెక్కి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్ నుంచి మొదలు పెడితే జంతర్ మంతర్ వరకు జరిగిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయవేత్తగా మారిన సామాజిక కార్యకర్త అర్వింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బాధితులకు చచ్చే వరకు శిక్షవేయండని ప్రజలు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nine parties invited for telangana meet
Hc slams delhi police for report on gang rape case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles