Nine parties invited for telangana meet

telangana, ys jagan, ysr congress, chiranjeevi, hyderabad, Lok Satta ,

The union home ministry has invited 8 political parties to the all party meeting to be held on december 28 on Telangana issue in New Delhi

Nine parties invited for Telangana meet.png

Posted: 12/22/2012 10:27 AM IST
Nine parties invited for telangana meet

loksatta-JPకాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈనెల 28వ తేదీన తెలంగాణ అంశం పై చర్చించేందుకు అఖిల పక్ష భేటిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నుండి ఇద్దరేసి నాయకులను ఆహ్వానిస్తూ లేఖలు కూడా పంపారు. అయితే లోక్ సత్తా పార్టీకి మాత్రం ఆహ్వానం పంపలేదు. ఎందుకంటే... ఆ పార్టీకి తగిన గుర్తింపు లేక పోవడంతో దానికి ఆహ్వానం పంపలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థానంలో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తెలంగాణపై తాజా పరిస్థితిపై అవగాహన కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పాయి. సమావేశంపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని సూచించాయి. తాము ఏ నిర్ణయం తీసుకునేది అఖిల పక్ష సమావేశం తర్వాత చెప్తామని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. మరి జయప్రకాశ్ నారాయణ పార్టీని ఆహ్వానించక పోయినా, ఒక మేధావిగా, పార్టీ అధ్యక్షుడిగా అతని పిలిచి అతని అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One crore signatures for ys jagan release
Sheila dikshit feels ashamed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles