Bs yeddyurappa officially resigns from bjp

BS Yeddyurappa , Former Karnataka chief minister,Bharatiya Janata Party, yedurappa resigns from BJP.

Former Karnataka chief minister BS Yeddyurappa on Friday formally quit the Bharatiya Janata Party (BJP), sending his resignation letter to president Nitin Gadkari.

BS Yeddyurappa officially resigns from BJP.png

Posted: 11/30/2012 01:02 PM IST
Bs yeddyurappa officially resigns from bjp

yadurappa

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాకుడిగా ఉంటూ నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ, పార్టీని ముందుకు నడిపించిన బియస్ యడ్యూరప్ప నేడు ఆ పార్టీని, శాసనసభ్యత్వాన్ని వీడి వేరే కుంపటి పెట్టుకోబోతున్నాడు. దీంతో ఆయనకు, బీజేపీకి ఉన్న నాలుగు దశాబ్దాల బంధం తెగిపోనుంది. బీజేపీకి గుడ్ బై చెప్పిన తరువాత కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించిన ఆయన, కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) పేరిట కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించి తీరతానని, డిసెంబర్ 9న హావేరిలో దాన్ని ప్రారంభిస్తానని 70 ఏళ్ల యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్నాం తన మద్దతు దారులతో ర్యాలీగా వెళ్లి, స్పీకర్ కి రాజీనామా పత్రం సమర్పిస్తానని చెప్పారు. తన రాజీనామా విషయాన్ని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

ఉద్వేగానికి లోనయ్యారు.తాను మొదటి నుండి బీజేపీలో ఉన్నానని, పార్టీనాకు ఎంతో ఇచ్చిందని, అలాంటి పార్టీకి రాజీనామా చేస్తానని అనుకోలేదని, పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ కంటతడి పెట్టారు. పార్టీ కోసం తాను ఎంతో శ్రమించానని చెప్పారు. తనను పార్టీలో సరిగా చూడలేని ఆయన బిజెపిని నిందించారు. పార్టీ కోసం తాను ఎంతో శ్రమించినప్పటికీ, లోకసభ సీట్లు ఎక్కువగా సంపాదించి పెట్టినప్పటికీ తనకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తనను వద్దని అనుకుంటోందని, అందుకే రాజీనామా చేస్తున్నానని యడ్యూరప్ప అన్నారు. ఇక ఈయన వెంట 50 మంది శాసన సభ్యులు వెళతారని అంటున్నారు. వారందరూ తమవెంట వచ్చినా, ప్రభుత్వాన్ని మాత్రం కూల్చబోనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy fire
Former prime minister ik gujral passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles