Kcr new action plan

kcr new action plan, trs party, trs mlas, trs mps, congress party, mim party, support withdran, trs leaders, kcr, trs party no support, andhra pradesh government, new politics, political news,

KCR New Action Plan

KCR.gif

Posted: 11/14/2012 11:56 AM IST
Kcr new action plan

.KCR New Action Plan

కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎంఐఎం మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన ఇంటిలో పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తొలుత ఈనెల 23న సూర్యాపేటలో తలపెట్టిన సభ నిర్వహణపై చర్చ జరిగిన తర్వాత రాజకీయాలపైకి మళ్లింది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో తాము భాగస్వాములు కావద్దని, అదే సమయంలో ప్రభుత్వం పడిపోతుంటే ఆపే ప్రయత్నం చేయవద్దని నిర్ణయించారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే మాత్రం దానిని అవకాశంగా తీసుకోవాలని కేసీఆర్ సహా పార్టీ నేతలు గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే క్షేత్రంలో పరిస్థితి టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉందని, కనీసం 70-80 అసెంబ్లీ స్థానాలు ఎక్కడికీ పోవనే భావన వారి మధ్య వ్యక్తమైంది. ఒకవేళ ప్రభుత్వం పడిపోవటం ద్వారా ఎన్నికలు వస్తే అనుకున్న వంద సీట్లు గెల్చుకోవటానికి మిగిలిన 20-30 స్థానాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని నిశ్చయించారు. కేంద్రంలోనూ రాజకీయ అనిశ్చితి నెలకొన్న దరిమిలా లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి లేదా విడివిడిగా ఎన్నికలు జరిగినా సత్తా చాటాలని నిర్ణయించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Phone romance goes wrong as boyfriend turns out to be a 67 year old man
Rakhi sawant is welcome to slap defamation notice  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles