Malala thanks the world for support

british people support to malala, pakistan girl malala, malala yousafzai, uk government, malala fight, malala day,

malala thanks the world for support

malala.gif

Posted: 11/10/2012 04:41 PM IST
Malala thanks the world for support

malala thanks the world for support

తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్‌లో కోలుకుంటున్న పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్(15).. ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. మేరకు ఆమె తండ్రి జియాయుద్దిన్ యూసఫ్‌జాయ్ ప్రకటన విడుదల చేశారు. ‘‘మలాలా కోలుకోవాలంటూ ఆకాంక్షించి, కష్టకాలంలో అండగా నిలిచి మద్దతు ప్రకటించిన ప్రతిఒక్కరికీ ఆమె కృత జ్ఞతలు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా యువతీయువకులు, పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా ఎంతోమంది ఆమె క్షేమంగా ఉండాలని కోరుకోవడంపట్ల చాలా ఆనందంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే మలాలాపై దాడిని ఖండించి, ఆమె క్షేమాన్ని కోరుకున్న ప్రతిఒక్కరికీ జియాయుద్దీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మలాలాకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మద్దతు పలికారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ బహుమతులు, గ్రీటింగ్ కార్డులు, స్వీట్లు, డబ్బులు, ఆమె ఫేవరేట్ సీడీలు, స్కూలు పుస్తకాలు, దుస్తులు, బొమ్మలు, ఆభరణాలు పంపించారు. గ్లోబల్ ఎడ్యుకేషన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ శుక్రవారాన్ని ‘మలాలా డే’గా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi called monkey by gujarat congress chief
Nararjuna fans fire on damarukam movie release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles