How laptops heat can frizzle mens sperm sterile

laptop use on speram damage, laptop affecto to mans sperm, damages sperm, laptop, man speram, damage male sperm, scientists, suggests, used wireless lechnology, doctors, over heat man sperm, facebook laptop,

How laptops heat can frizzle mens sperm sterile

laptops.gif

Posted: 11/07/2012 07:13 PM IST
How laptops heat can frizzle mens sperm sterile

How laptops heat can frizzle mens sperm sterile

గంటలతరబడి ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని కుస్తీపడే పురుషపుంగవులారా తస్మాత్ జాగ్రత్త! మీ ల్యాప్‌టాప్ నుంచి విడుదలయ్యే ఉష్ణం.. వీర్యకణాలకు తీరని చేటు చేస్తుందని బ్రిటన్ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికిది పాతవిషయమే గానీ.. సంతానలేమితో బాధపడుతూ వారి వద్దకు వచ్చిన వ్యక్తి సాక్ష్యంగా నిలిచాడు. ఆ వ్యక్తి పేరు.. స్కాట్ రీడ్ (30). అతడి భార్య లారా. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన స్కాట్ రోజూ సాయంత్రం పూట రెండుగంటలపాటు ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని వాడేవాడట. ఫేస్‌బుక్ అప్‌డేట్ చేసేవాడటన. అయితే, పెళ్లయి చాన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో స్కాట్, లారా వైద్యులను సంప్రదించారు. వారిద్దరికీ అన్ని పరీక్షలూ చేసిన వైద్యులు.. ల్యాప్‌టాప్ వాడకంతో స్కాట్ వీర్యకణాలు దెబ్బతిన్నాయని, ఇక వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చిచెప్పడంతో ఆ దంపతులు హతాశులయ్యారు.

పొడుగాటి తోకతో అండం దిశగా వేగంగా ఈదుకుపోవాల్సిన స్కాట్ వీర్యకణాలు లుంగలు చుట్టుకుని నీరసంగా కదులుతున్నాయని క్వీన్ అలెగ్జాండ్రా హాస్పిటల్‌కు చెందిన బయోమెడికల్ ఆండ్రాలజిస్ట్ స్యూ కెన్‌వర్తీ తెలిపారు. ఇది ల్యాప్‌టాప్ వాడిన ప్రభావమేనని స్యూ స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి సమస్య హోటళ్లలో పనిచేసే చెఫ్‌లకు వస్తుందని వివరించారు. ల్యాప్‌టాప్ వాడే మగవారు దాన్ని ఒళ్లో పెట్టుకోకుండా.. ఏ టేబుల్ మీదో, నేలమీదో పెట్టుకుని వాడాలని స్యూ సూచించారు. స్కాట్‌కూ అదే సూచన చేయడంతో అతడు దాన్ని ఆచరించాడు. దాదాపు ఏడాది తర్వాత అతడి పరిస్థితి మెరుగైంది. స్కాట్, లారా దంపతులకు చిన్నారి టారిన్ జన్మించింది. ఆ పాపకు ఇప్పుడు 11 నెలల వయసు. స్కాట్ మాత్రం.. నాటి నుంచీ తన తోటి మగవారందరికీ ల్యాప్‌టాప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama victory speech
Russian divers find missing gold ship  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles