Ysjagan completes 100 days of jail life

100,100 days,access,Chanchalguda Central Prision,Doordarshan,family,family members,interest,Jagan,jail,jail life,Kodali Nani,last,life,Mahatma Gandhi

YSR Congress chief YS Jaganmohan Reddy was arrested by the CBI in connection with the illegal assets case on May 27th. Since then Jagan has become an

Y.S.Jagan completes 100 days of Jail life.png

Posted: 09/05/2012 01:14 PM IST
Ysjagan completes 100 days of jail life

Jaganవైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి మే 27వ తారీఖున సీబీఐ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. జగన్ అరెస్ట్ అయి. జైలులో ఉండబట్టి నేటికి వందరోజులు సక్సెస్ పుల్ గా పూర్తి అయ్యాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉండబట్టి అప్పుడే 100 రోజులు గడిచిందా ? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక వైయస్ జగన్ మోహన్ రెడ్డి జైలులోకి వెళ్లి 100 రోజులు నేటితో పూర్తి కావస్తున్న ఆయన పార్టీకి, ఆయనకు ప్రజల్లో మరింత సానుభూతి, ఆదరణ పెరిగిందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు.

ఇక ఆయన లేని లోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నా, ఆయన బదులు పులివెందుల శాసన సభ్యురాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ పూర్తి స్థాయిలో బలపడకున్నా నిత్యం ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. ఇక ఈయన అరెస్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్ అరెస్టు రాజకీయ అరెస్టుగానే అభివర్ణిస్తోంది. జనానికి జగన్ మోహన్ రెడ్డిని దూరం చేయాలని కుట్రలో భాగంగానే ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయించిందని ఆరోపిస్తోంది. తమ్ముడిని హత్య చేసిన కేసులో కేఏ పాల్ కి బెయిల్ ఇచ్చారు. కానీ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వారికి బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుపడుతుందని, జగన్ విషయంలో దూకుడుగా ప్రవర్తించిన సీబీఐ ధర్మాన ప్రసాదరావు విషయంలో ఆచితూచి ఆడుగులు వేస్తుందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి 2014 లోపు సీబీఐ జగన్ కేసును ముగిస్తుందా... లేదంటే ఇంకా విచారణ చేస్తూనే ఉంటుందా..? చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anti obama film a box office hit
Vaiko sl presidents visit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles