Seetha nagamani mother died

seetha nagamani mother died, Lover marriage, sons , Hyderabad,

seetha nagamani mother died

seetha.gif

Posted: 08/09/2012 12:37 PM IST
Seetha nagamani mother died

seethanagamani

తన కూతురి ప్రేమ పెళ్లిని మనసార ఒప్పుకుంది.  కూతురి ప్రేమ పెళ్లికి మద్దతు తెలిపినందుకు .. కొన్న కొడుకులు వదిలేసారు.  కన్న కూతురితో పాటు .. తల్లి జీవనం సాగిస్తుంది. తమ ప్రేమ పెళ్లికి  తల్లి  పెద్ద వ్యక్తిగా వచ్చినందుకు .. కూతురు సీతా నాగమణి.. తల్లి రుణం తీర్చుకుంది.  నవమాసాలూ మోసి, కని, పెంచిన కన్నతల్లి చనిపోయినా.. కొడుకులు కడసారి చూపునకు కూడా రాకపోతే తానే కొడుకులా మారిందా కూతురు! తల్లి చితికి నిప్పంటించి కన్న రుణం తీర్చుకుంది. హైదరాబాద్ పాతబస్తీలోని రాజన్నబావి శివాజీనగర్‌లో జరిగిందీ ఘటన. ఈ ప్రాంతానికి చెందిన విజయ్‌సాగర్ పశ్చిమగోదావరి జిల్లా కవిటం గ్రామానికి చెందిన సీతానాగమణిని 1983లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.  ఈ వివాహాన్ని నాగమణి తల్లి అన్నపూర్ణమ్మ తప్ప మిగతా కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. అన్నపూర్ణమ్మ మాత్రం కూతురుతో పాటే హైదరాబాద్‌కు వచ్చేసి అప్పట్నుంచీ అక్కడే ఉంటోంది. అయితే, ఇటీవలికాలంలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అన్నపూర్ణమ్మ (78) చికిత్స పొందుతూ ఈ నెల ఆరున మరణించారు. ఈవిషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపినా ఎవరూ స్పందించలేదు.  మూడురోజుల పాటు వేచిచూసినా తన అన్నదమ్ములు తల్లిని చూడటానికి రాకపోవడంతో నాగమణే నడుం బిగించారు. తల్లి అంత్యక్రియలను అంతా తానై పూర్తిచేశారు. నల్లవాగు శ్మశానవాటికలో తల్లి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srikalahasti
Pakistani man held for forcing hindu girl to marry him  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles