Former bsp functionary and dalit leader commits suicide in up

Former BSP functionary and Dalit leader commits suicide in UP,Dalit leader,BSP leader,Baliram Prasad

Former BSP functionary and Dalit leader commits suicide in UP

leader.gif

Posted: 07/17/2012 11:42 AM IST
Former bsp functionary and dalit leader commits suicide in up

Dalit leader sets himself ablaze in UP

దళితుల అభ్యున్నతి కోసం తాము చేసిన త్యాగాలు వృథా అవుతున్నాయన్న వాస్తవం ఆ వృద్ధ నేతను తీరని వ్యథకు గురిచేసింది. తనలాంటి ఎందరో కష్టపడి సాధించిన హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన నిబంధనలు గాలికిపోతున్నాయన్న కఠోర వాస్తవం ఆయన్ను కలచి వేసింది. నేటి ప్రజా ప్రతినిధుల అలసత్వ వైఖరి ఆయన్ను నిలవనీయలేదు. దాంతో ఏకంగా కలెక్టరేట్ సాక్షిగా అగ్గి పెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడాయన! ఆయన పేరు బలిరాం ప్రసాద్. వయసు 65 ఏళ్లు. ప్రముఖ దళిత నాయకుడు. గతంలో బీఎస్‌పీలో కీలక భూమిక నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం అంబేద్కర్ సమాజ్ పార్టీలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ కలెక్టరేట్ కాంపౌండ్‌లోని అంబేద్కర్ పార్క్‌లో సోమవారం ఆయన ఆత్మాహుతికి పాల్పడటం పెను సంచలనమైంది. వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు ప్రకటించారు. ఆయన వద్ద దొరికిన సూసైడ్ నోట్‌లోని వివరాలను వెల్లడించారు.

"ప్రస్తుత పరిస్థితుల పట్ల, ప్రజా ప్రతినిధుల పనితీరు పట్ల నేను తీవ్రంగా కలత చెందా. దళితులు, పేదల అభ్యున్నతి కోసం నేను, నాలాంటి ఎందరో నేతలు జీవిత కాలం పోరాడాం. వారిని సామాజిక అనాచారాల బారి నుంచి బయటపడేసేందుకు ఎంతగానో ప్రయత్నించాం. కానీ నేడు ఏం జరుగుతోంది? వారిపై అకృత్యాలు నిత్యకృత్యమయ్యాయి. వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బాబా సాహెబ్ చేసిన చట్టాలూ కొరగానివిగా మారిపోయాయి. ఇదంతా చూశాక వారికి ఇంకా మేలు జరుగుతుందన్న ఆశ చచ్చిపోయింది. ఇంకా పోరాటాన్ని కొనసాగించే శక్తీ నాకు లేదని అర్థమైపోయింది. అందుకే తనువు చాలించాలని నిర్ణయించుకున్నా'' అని బలిరాం తన లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2611 still casts a shadow on indo pak cricket ties
Udenafil viagra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles