Cm kiran indira bata postponed

CM kiran Indira Bata postponed

CM kiran Indira Bata postponed

CM kiran Indira Bata.gif

Posted: 07/11/2012 08:03 PM IST
Cm kiran indira bata postponed

CM-kiranనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఒంటెద్దు పోకడ గా వ్యవహరిస్తున్నాడనేది బహిరంగ రహస్యం. తన సొంత నిర్ణయాలు, తనకు పేరు వచ్చే విధంగా పథకాల పేర్లు, కనీసం ఆశాఖ మంత్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం, సమావేశాలు నిర్వహించక పోవడం ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయినా కిరణ్ తన పంథాను మార్చుకోలేదు. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి ‘‘ఇందిరమ్ బాట’’ పేరుతో ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం పై కూడా సర్వత్రా తన మంత్రి వర్గం నుండే విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈ ప్రోగ్రామ్ రేపు ప్రారంభించడానికి సిద్ధమైయ్యారు.

కానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన ఇందిరమ్మబాట కార్యక్రమం వాయిదా పడింది.తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కార్యక్రమం వాయిదా పడినట్లు చెబుతున్నా, కొందరు మంత్రులు లేవనెత్తిన సందేహాలు కూడా ఈ కార్యక్రమం వాయిదాపడడానికి దోహదపడి ఉండవచ్చు. విద్యుత్ సమస్య , వర్షాభావం వంటి సమస్యలు ఉన్న తరుణంలో ప్రజలనుంచి ఎదురయ్యే ప్రశ్నలను దృష్టిలో ఉంచుకుని కూడా వాయిదా వేసినట్లు అనధికార వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attack on jr ntr office
A p j abdul kalam joins facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles