ఎన్టీఆర్ పై దాడి అంటే జూ. ఎన్టీఆర్ పై దాడి కాదండి. తెలుగు దేశం పార్టీలో మంటలు మండుతున్న విషయం తెలిసిందే. గుడివాడ వేడి బాగా హీటెక్కింది . ఆ హీట్ వలన ఫిల్మ్ నగర్ లోని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం పై బుధవారం అర్థారాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఫిల్మ్ నగర్ లో అలజడి నెలకొంది. ఈ దాడి ఆకతాయిలు చేశారా? లేదా ఎన్టీఆర్ పై కక్షతో చేశారా? అన్నది తెలియాల్సివుంది. దాడి చేసిందేవరో తాము చూడలేదని ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.
టిడిపి నుంచి సస్పెండయిన కొడాలినాని అనుచరులెవరైనా ఈ దాడి చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాని, ఎన్టీఆర్ ఇద్దరు మిత్రులే గనక ఆకతాయిలు గానీ లేదా టిడిపి వర్గీయులు ఎవరైనా ఈ దాడి జరిపి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు నాని ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబును దూషించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ ఆఫీసు మీద దాడిఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదీ ఏమైన పార్టీ లో ఉన్న నాయకుల మద్య గొడవలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more