Nandamuri balayya by election campaign

nandamuri balayya by election campaign

nandamuri balayya by election campaign

12.gif

Posted: 05/03/2012 01:30 PM IST
Nandamuri balayya by election campaign

      ఉపఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సినీనటుడు.. నందమూరి నటసింహం.. బాలకృష్ణ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పట్టుబట్టి మరీ అనంతపురం అర్బన్, మాచెర్ల స్థానాలకు టికెట్లు ఇప్పించుకున్న బాలయ్య తన అనుచరులను గెలిపించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. తన పవర్ ఫుల్  పంచ్  డైలాగ్ లతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. bala
      అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధం ఉండడం, తాను నటించిన చెన్నకేశవ రెడ్డి, నర్సింహనాయుడు, సింహ ఈ కథాంశాలతోనే హిట్ కావడం కూడ తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్  తనకు ఉన్న అభిమానుల ఓట్ల బలం తోడైతే అనుచరుల గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అదేశిస్తే తాను పోటీకి సిద్దమని బావ చంద్రబాబుకు సంకేతాలు పంపిస్తున్నారు.
     ఉప ఎన్నికల ప్రచారానికి బాలయ్యను పంపించడానికి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు స్థానాలకే కాకుండా ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లోనూ ప్రచారానికి పంపిచాలనే ఆలోచనలో బాబు ఉన్నట్లు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A new look cm narendra modi soon
Himachal village first smoke free hamlet in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles