House arres

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

house arrest.GIF

Posted: 03/15/2012 03:05 PM IST
House arres

కాలం మారినా... మారు మూల గ్రామాల్లో ఇంకా కుల పెద్దల పెత్తనం పోవడం లేదనడానికి ఇదొక నిదర్శనం. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా పంచాయితీ పరిధిలోని కొల్లాపురం గ్రామానికి చెందిన చీమల పొట్టెయ్య పెద్ద కొడుకు వెంకటేశ్వర్లు కొత్తగూడెం గ్రామంలో కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడటంతో ఆ మహిళ తన కుటుంబాన్ని వదిలి వెంకటేశ్వర్లతో కాపురం చేస్తుంది.

ఈ విషయం పై కుల పెద్దలు పంచాయితీ నిర్వహించి వెంకటేశ్వర్లకు 20 వేల జరిమానా విధించారు. ఈ సొమ్ము చెల్లించలేక వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఈ విషయం పై ఆగ్రహించిన కుల పెద్దలు ఏకంగా వెంకటేశ్వర్ల తల్లిదండ్రులను నియదీయడమే కాకుండా వారి ఇంటి చుట్టు ముళ్ళ కంచె వేసి, ఊళ్లో వాళ్లు ఎవరూ వారితో మాట్లాడ కూడదని హుకుం జారీ చేశారు. మాట్లాడితే వెయ్యి రూపాయలు జరిమానా వేస్తామని చెప్పడం విశేషం. అయితే కుల పెద్దలను ఎదిరించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు బయపడుతున్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway minister dinesh trivedi
Over 422 lakh indians went missing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles