Now insure your marriage against losses

bajaj allianz life insurance company,limited,finance,insurance,insurance covers,personalfinance

But insurer will not pay for marriages turning sour due to personal differences between the bride and the groom, and the claims would be entertained only for losses due to external factors.

insure your marriage.GIF

Posted: 12/26/2011 02:18 PM IST
Now insure your marriage against losses

Marriageప్రజలను ఏదో విధంగా మధ్యపెట్టి వారి నుండి బిజినెస్ చేసుకునే కంపెనీలు ఉంటాయి. అలాంటివే ఇన్సూరెన్స్ కంపెనీలు. ఇప్పటి వరకు మనిషికి అన్ని ఇన్సూరెన్స్ లు కనిపెట్టారు. కానీ ఆ బిజినెస్ అంతా కామనే అనుకున్నారో ఏమో గానీ రోజుకో కొత్త ఆలోచన చేసే ఇన్యూరెన్స్ కంపెనీలకు ఇప్పుడో సరికొత్త ఐడియా వచ్చింది. వివాహం సందర్భంగా తలెత్తే సమస్యల్లోనూ వారికి వ్యాపార అవ కాశాలు కనిపించాయి!  ఇప్పుడు పెళ్లి న ష్టాలకు కూడా బీమా చేసుకునే వీలు కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. కొన్ని కారణాలతో పెళ్లి వాయిదా పడటం, రద్దుకావడం వంటి సందర్భాల్లో నష్టాలను పూడ్చడానికి ఈ బీమా దోహదపడుతుంది. వ్యక్తిగత విభేదాల వల్ల పెళ్లి ఆగిపోతే మాత్రం బీమా సొమ్మును చెల్లించరు. ప్రమాదాలు, విపత్తులు, అనుకోకుండా జరిగే మానవ తప్పిదాలు, గొడవలు వంటి సమస్యలతో పెళ్లి పెటాకులైన సందర్భాలకేబీమా వర్తిస్తుంది. ఐసీఐసీఐ లాంబార్డ్, బజాజ్ అలయెన్జ్ వంటి పలు సంస్థలు ఇలాంటి ప్రత్యేక పెళ్లి బీమాను అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం ధనవంతులు, సెలబ్రిటీలే ఈ తరహా బీమాను అధికంగా తీసుకుంటున్నారు.

పెళ్లి ఖర్చు అంతకంతకూ పెరిగిపోతున్నందువల్ల ఈ బీమాకు మరింత ఆదరణ వస్తుందని ఇన్సూరెన్స్ కంపనీలు ఆశిస్తున్నాయి. అగ్ని ప్రమాదం, ప్రకృతి విపత్తులతో పెళ్లి ఆగిపోవడం లేదా వాయిదా పడటం, పెళ్లి జంటలో ఎవరికైనా ప్రమాదం జరగడం, పెళ్లి తర్వాత వారం రోజుల్లో ప్రమాదం జరగడం, దొంగతనం, వేడుకల్లో విషాహారం వల్ల అస్వస్థత చెందడం, ఇతర నష్టాలు కూడా ఈ బీమా పరిధిలోకి వస్తాయి. దీనికి నాలుగు నుంచి 15వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, బందులు, ఉద్యమాలు, ఉగ్రవాద చర్యలు, కిడ్నాప్ వంటి కొన్ని సందర్భాలకు మాత్రం ఈ బీమా వర్తించదు. ఇది వినడానికి కొత్తగా ఉన్నా అనేక కారణాల వల్ల  అర్థాంతరంగా పెళ్ళి ఆగిపోయిన వారికి బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unitech md denied permission to go to singapore
Visakha agency village lammasingi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles