Visakha agency village lammasingi

visakha,village,lammasingi, Visakhapatnam, ourists, winter.

Visakha agency village Lammasingi lies under the blanket of fog all through the year| Road Map to Lammasingi from Visakhapatnam Tourists are invited with.

Visakha agency village Lammasingi.GIF

Posted: 12/26/2011 01:42 PM IST
Visakha agency village lammasingi

ఉత్తర భారతదేశానికి ఏ మాత్రం తీసిపోకుండా మన రాష్ట్రంలో అదీ విశాఖలో తలపిస్తుంది. ఒక్క డిగ్రీ... ఒకే ఒక్క డిగ్రీ! ఇదీ విశాఖ మన్యంలోని లంబసింగిలో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత. ఉదయం పది గంటలు దాటినా సూరీడి జాడ లేదు. మంచు వర్షంలా కురుస్తోంది. చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 3.6 డిగ్రీలకు పడిపోయింది. లంబసింగిలో మరీ దారుణంగా ఒక్క డిగ్రీయే నమోదైంది. 2008లో ఇదే రోజు.. అంటే డిసెంబర్ 25న సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఇదే కనిష్ఠం. విశాఖ మన్యంలోని చింతపల్లి, లంబసింగి, సప్పర్ల, తదితర ప్రాంతాలు సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల పైచిలుకు ఎత్తులో ఉండటంతో ఇంతగా నమోదు అవుతున్నాయని అంటున్నారు. గిరిజనుల సాధారణ జీవనానికి ఆటంకం కలుగుతోంది. ఉదయం పది గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడి.. వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రగ్గులు కప్పుకొన్నా, స్వెట్టర్లు వేసుకున్నా ఉపశమనం కలగడం లేదు. ఇళ్లల్లో కుంపట్లు వెలిగించుకుంటున్నారు. ఇదే పరిస్థితి మరో పది రోజులు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Now insure your marriage against losses
Hc suspends rajagopals bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles