Obama bans daughters from facebook

Obama bans daughters from Facebook.The media, obsessed with social media, and politics, got the perfect winter

Obama bans daughters from Facebook.The media, obsessed with social media, and politics, got the perfect winter

Obama bans daughters from Facebook.GIF

Posted: 12/18/2011 11:37 AM IST
Obama bans daughters from facebook

obama-daughtersకేంద్ర మంత్రి కపిల్ సిబాల్ సోషన్ నెట్ వర్కింగ్ సైట్ల పై ఆంక్షలు విధిస్తామని ప్రకటన చేశారు. వీటి వల్ల ముఖ్యమైన వ్యక్తులకు అసౌకర్యం కలగడమే కాకుండా, మంచి సమాచారం కంటే చెడు సమాచాలమే ఎక్కువగా ప్రచారం అవుతుందని అన్నారు. అయితే దీని పై ఆయన ఆంక్షలు విధిస్తారో లేదో కానీ, అమెరికా అధ్యక్షుడు మాత్రం తన పిల్లల విషయంలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల పై ఆంక్షలు విధించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూ డా తన కూతుళ్లను ఇక మీదట దాని జోలికి వెళ్లొద్దని చెప్పారని సమాచారం.

ఒబామా పెద్దకుమార్తె మాలియా (13)కు ఫేస్‌బుక్ వాడేందుకు వయసుకూడా సరిపోతుంది. ఆమె చెల్లెలు సాషాకు మాత్రం ఇంకా పదేళ్లే. అయితే ఈ ఇద్దరని ఫేస్ బుక్ వాడవద్దని ఆంక్షలు విధించారట. 2008 అధ్యక్ష ఎన్నికల్లో జనంలోకి వెళ్లడానికి సోషల్ మీడియాను ప్రధానాయుధంగా ఉపయోగించుకున్న ఒబామాయే.. ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారు. తన కు టుంబానికి చెందిన వ్యక్తిగత విషయాలను జనానికి అంతగా తెలియజేయడం ఇష్టం లేకనే ఆయన ఇలా చెప్పి ఉంటారని భావిస్తున్నారు.  ఎన్నికల ప్రచార సమయంలో ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ను విస్తృతంగా వాడుకోవడంతో ఆయనను 'తొలి సోషల్ మీడియా అద్యక్షుడి'గా అంతా పిలుచుకున్నారు. ఆయన ఫేస్‌బుక్ పేజీకి 2.4 కోట్ల 'లైక్'లు రావడంతో మరోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik missing since 48 hrs
Boda janardhan has joined in ys jagan ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles