Vikram akula quits sks microfinance

Vikram Akula quits SKS Microfinance, Micro Finance Helps Poor People, vikram Akula, the one-time poster boy of microfinance, SKS Microfinance, microfinance company, Founder and Chairman Vikram Akula

Vikram Akula quits SKS Microfinance

Vikram Akula.GIF

Posted: 12/05/2011 04:34 PM IST
Vikram akula quits sks microfinance

Vikram_Akula_quits_SKS_Microfinance

దేశంలో అతి పెద్ద సూక్ష్మ రుణ సంస్థను (ఎమ్ఎఫ్ సీ) పుట్టించిన  విక్రమ్ ఆకుల రెండో  అధ్యాయానికి సిద్దమవుతున్నారు.  మొబైల్ చెల్లింపుల  వ్యాపారంలోకి అరంగ్రేటం  చేయడానికి తగిన  సన్నాహాల్లో  ఆయన నిమగ్నమైనట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఎస్ కే ఎస్  మైక్రో ఫైనాన్స్ లో క్రీయాశీల బాధ్యతల నుంచి  ఇటీవలే  విక్రమ్ వైదొలగారు.  ఆ కంపెనీకి  విక్రమ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరించిన  సంగతి తెలిసిందే.

ఎస్ కే ఎస్  మైక్రో ఫైనాన్స్ ను రెండు దశాబ్దాల క్రితమే స్థాపించినప్పటికి , దాని ప్రగతి ప్రస్థానం అంతా గత అయిదేళ్లలో నమోదు అయింది. దేశంలో  మైక్రో ఫైనాన్స్ రంగం శర వేగంగా  విస్తరించగా ,అందులో  అధిక శాతం  వాటాను ఎస్ కే ఎస్  మైక్రో ఫైనాన్స్ దక్కించుకుంది.  అంతే కాకుండా  పబ్లిక్  ఇష్యూకు (ఐపీఓ)  వచ్చిన తొలి ఎమ్ఎఫ్ సీగా  కూడా దీనికి గుర్తింపు లభించింది.  ఎంత వేగంగా  విస్తరించిందో  అంతే  వేగంగా కింద  పడ్డ  కంపెనీ  కూడా ఇదే . 2010 ఆగస్టులో రూ. 935  షేర్  ధరకు పబ్లిక్  ఇష్యూకు రాగా, స్టాక్ మార్కెట్లో  రూ. 1,000కి  పైగా  ధరలో  నమోదు  అయింది. గరిష్ఠంగా షేర్  ధర రూ. 1400కు మించిపోయింది. ఆ సమయంలో  దాదాపు రూ. 10,000 కోట్ల  మార్కెట్ విలువను ( మార్కెట్  క్యాపిటలైజేషన్)  ఎస్ కే ఎస్  మైక్రో ఫైనాన్స్ సాధించింది. కానీ ఆ తరువాత  కంపెనీకి  ఎండిగా ఉన్న గురమణిని ఆకస్మికంగా తొలగించిడం, అదే సమయంలో  రాష్ట్రంలో ప్రభుత్వం ఎమ్ఎఫ్ లను  కట్టడి చేస్తూ ఆర్డినెన్స్ను  తీసుకు రావడంతో  ఎస్ కే ఎస్  దశ తిరగబడింది.

నాన్ – కంపీట్  అగ్రిమెంట్

కంపెనీ మార్కెట్  విలువ ప్రస్తుతం రూ. 750 కోట్లకు  పడిపోయింది. గత ఏడాదిన్నర  కాలంలో  కంపెనీకి  సంబందించి అనూహ్యంగా  చోటు చేసుకున్న పరిణామాలన్నీ  జగద్విదితమే. చివరికి  విక్రమ్  ఆకుల రాజీనామాతో  ఎస్ కే ఎస్  మైక్రో ఫైనాన్స్ కు  సంబంధించినంత  వరకు ఒక శకం  ముగిసినట్లు  అవుతోంది .  రాజీనామా  చేసిన  ఆయనతో  బయటకు వెళ్లి పోటీగా  ఇదే  వ్యాపారాన్ని  ప్రారంబించకూడదనే  ఒప్పందాన్ని  (నాన్ – కంపీట్ అగ్రిమెంట్ ) ప్రస్తుత  యాజమాన్యం  కుదుర్చుకున్నట్లు తెలుస్తొంది.  అందువల్ల  నేరుగా  మైక్రోఫైనాన్స్ వ్యాపారంలోకి ప్రవేశించే  అవకాశం  కానీ, ఆసక్తి  కానీ ఆయనకు  లేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.  ప్రస్తుతం ఉన్న  అనుకూల  వాతావరణంలో  ఎమ్ఎఫ్ సీని  పెట్టి  పెద్దది  చేయడం  అంత తెలికైన పని కాదు. ఈ  నేపథ్యంలో  ఆయన కాస్త భిన్నమైన వ్యాపారం  వైపు  మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.  ఇందులో భాగంగా  మొబైల్  చెల్లింపుల సేవలు  అందించేందుకు  ఒక కంపెనీ స్థాపించనున్నారంటున్నారు.

నూతన రంగంలోకి  మొదట తానే

దేశంలో  120 కోట్ల మంది జనాబా ఉంటే, మొబైల్ ఫోన్  కనెక్షన్లు ప్రస్తుతం 70 కొట్లకు చేరుకున్నాయి. గ్రామీణ  ప్రాంతాలకు సైతం  మొబైల్  సేవలు  పెద్ద  ఎత్తున విస్తరించాయి.  రహదారి లేని, తాగు నీటి వసతి లేని గ్రామం అయినా ఉంటుంది కానీ మొబైల్  ఫోన్లు లేని గ్రామం  ప్రస్తుతం దేశంలో  ఏమూలకు వెళ్లిన ఉండదంటే అతిశయోక్తి కాదు.  అందువల్ల  దీన్ని ఒక  అవకాశంగా తీసుకొని  మొబైల్  చెల్లింపు  పరిజ్జానాన్ని గ్రామీణ ప్రాంత  ప్రజానీకానికి  అందుబాటులోకి  తీసుకు రావడంతో  పెద్ద వ్యాపార అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తొంది.  ఇప్పటి  వరకు  ఈ విభాగంలో   ఎటువంటి  సంస్థ కార్యకలాపాలు  సాగించడం లేదు.  ప్రభుత్వ రంగ బ్యాంకులు కొంత కాలంగా  ప్రయత్నాలు  చేస్తున్నప్పటికి  అవి ఇంకా  పూర్తిస్థాయిలో  కార్యరూపం  దాల్చలేదు.

మరో వైపు ఎస్ కే ఎస్  మైక్రో ఫైనాన్స్ నుంచి విక్రమ్  ఆకుల  అనుచరులు రాజీనామాలు చేస్తున్నట్లు  తెలుస్తొంది.  కంపెనికి  ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకొన్న మరుసటి రోజు నుంచే ఒక్కొరొక్కరుగా ఆయన మనుషులు రాజీనామా చేస్తున్నట్లు కంపెనీ వర్గాల  సమాచారం.  రాజీనామాల పర్వం  ఈ మధ్య వేగవంతమైనట్లు , గత వారం రోజుల్లో  పెద్ద ఎత్తున సిబ్బంది  రాజీనామా చేసినట్లు  చెబుతున్నారు.  కంపెనీ కేంద్ర  కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయిలో  మేనేజర్లు, ప్రతినిధులు, ఇతర రకాల ఉద్యోగులు రాజీనామా  చేసినట్లు  సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. విక్రమ్ ఆకుల  త్వరలో  స్థాపించబోయే కొత్త కంపెనీలో  చేరే  ఉద్దేశంతోనే ఎస్ కే ఎస్  మైక్రో ఫైనాన్స్ నుంచి  మీరు వీరు బయటకు వెళ్లిపోతున్నట్లు ఆ వర్గాలు  వివరిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mim declares its opininon in the assembly on telangana
Chandrababus comment cm brother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles