యోగ పరిభాషలో మానవుల్లో వర్గాలకు అర్థం వేరు. యోగ శాస్త్రంలో కూడా మానవుల వర్గీకరణ జరిగింది. కానీ అది వారి జన్మనిబట్టి కాదు, ఆచరణనుబట్టి. యోగశాస్త్రమంతా మనిషిలో అంతర్గతంగా ఉండే శక్తి మీద ఆధారపడివుంది. యంత్రమెంత సామర్థ్యం కలదైనా దానిలో ఇంధనం లేకపోతే పనిచేయనట్టే, మనిషి ఆరోగ్యంగా కనిపిస్తున్నా కార్యాచరణ చెయ్యాలంటే మనిషి శరీర వ్యవస్థకి శక్తి అవసరం. కార్యాచరణకు కావలసిన ఆలోచన చెయ్యటానికి, నిర్ణయం తీసుకోవటానికి, తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచటానికి శక్తి కావలసివుంటుందన్నది అందరికీ తెలిసిందే. మానవులందరిదీ సమానమైన శారీరక వ్యవస్థే అయినా కొందరు చెయ్యగలిగే పనులను మరికొందరు చెయ్యలేక పోవటానికి కారణం ఏమిటంటే వారిలో శక్తి ఉత్పాదనలోనూ, శక్తి వినియోగంలోనూ ఉండే తేడా.
ఒకే ఆఫీసులో ఒకే స్థాయిలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు సమానంగా ఉన్నా, వారి జీవన శైలిలో చాలా తేడా ఉంటుంది. అందుకు కారణాలు ఎన్నో ఉండవచ్చు కానీ ఎవరికైనా మౌలికంగా రెండే విషయాలు ఆర్థిక స్తోమతుకు దోహదం చేస్తాయి. ఒకటి వారి ఆదాయం, రెండవది వారి ఖర్చు. ఈ రెండిటికీ గల వ్యత్యాసమే నిల్వ. ఆ నిల్వ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆర్థిక స్తోమతు ఉంటుంది. సంపన్నుడౌతాడు. అలాగే, మనిషి తనలోని శక్తిని సంపాదించటంలోనూ ఖర్చు పెట్టటంలోనూ నియమాన్ని పాటిస్తే శక్తి సంపన్నుడవుతాడు. శక్తిని సంపాదించటానికి ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, వ్యాయామం, యోగధ్యానాలు దోహదం చేస్తాయి. ఆ శక్తి వినియోగంలో పొదుపుని పాటిస్తే శక్తి నిల్వ పెరుగుతుంది. దానితో భౌతిక స్థాయిలో చూసుకుంటే రోగ నిరోధక శక్తి, మానసికానందం, జీవితంలో తృప్తి లభిస్తాయి. ఆధ్యాత్మికంగా, ఙాన ప్రాప్తి, సంకల్ప సిద్ధి, కర్మలనుండి విముక్తి, కైవల్య ప్రాప్తి ఒనగూడుతాయంటుంది శాస్త్రం.
దీన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. ఒక మనిషి రైల్వే స్టేషన్ కి హడావిడిగా వచ్చి విచారణ చేస్తే, తను ఎక్కాల్సిన రైలు గంట లేటుగా నడుస్తోందని తెలుస్తుంది. దానితో అతనికి కోపం వచ్చేస్తుంది. తిట్టని తిట్టు తిట్టకుండా రైల్వే అధికారులు, ఉద్యోగస్తులు, రైల్వే మంత్రి దగ్గర్నుంచి ప్రధాన మంత్రి వరకూ అందరినీ తిట్టి పోస్తాడు. చివరకు రైలు వస్తుంది. అందులో ఎక్కి కూర్చుంటాడు. ఆ మనిషి రైల్వే స్టేషన్ కి వచ్చినప్పుడు అతనిలోని శక్తిని రహస్యంగా కొలిచి నమోదు చెయ్యగలిగి, దాన్ని అతను రైలు ఎక్కి కూర్చున్న తర్వాత అతనిలో మిగిలివున్న శక్తితో పోల్చి చూస్తే అది 10 శాతం కూడా ఉండకపోవచ్చు.
మరో మనిషి అలాగే అదే రైలు కోసం వచ్చి లేటుగా నడుస్తుందని తెలుసుకుని, చేసేదేమీలేదు కాబట్టి ఒక చోట కూర్చుని అంటీ ముట్టకుండా ఎవరితోనూ ఏ మాటలూ పెంచుకోకుండా వాదనలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండి రైలు వచ్చిన తర్వాత ఎక్కి కూర్చుంటే అతని లో శక్తి 25 శాతం కంటే ఎక్కువ ఖర్చవలేదని తెలుస్తుంది.
మూడవ మనిషి (ఉదాహరణ కోసం) అలాగే అదే స్థితిలో రైలు కోసం వేచి చూస్తుంటాడు. రైలు రావటానికింకా సమయం ఉంది కాబట్టి తన ల్యాప్ టాప్ తీసి పెండింగ్ పనులను చేసుకుంటూ ఉంటాడు. ఈ మనిషి రైలు ఎక్కిన తర్వాత చూస్తే అతనిలో 50 శాతం శక్తి మిగిలి వుందని తెలుస్తుంది.
ఇక నాలుగవ రకం మనిషి అదే పరిస్థితుల్లో, రైలుకి ఎలాగూ వేచి చూడాల్సిందే కాబట్టి తనకి అక్కడ చెయ్యదగ్గ పనేమీ లేదు కాబట్టి, ఒక దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్తాడు. రైలు వచ్చిన తర్వాత తన సీటులో కూర్చున్న ఆ మనిషి లోని శక్తి చూస్తే పదిరెట్లు పెరిగి ఉంటుంది.
పై ఉదాహరణలో మొదటి రకం మనిషి శూద్రుడు. తన శక్తిని అనవసరంగా ఖర్చు పెట్టుకుంటుంటాడు- (Energy dissipation). రెండవ రకం మనిషి వైశ్యుడు. తన శక్తిని జాగ్రత్తగా పదిలంగా కాపాడుకుంటుంటాడు. (Energy conservation). మూడవ మనిషి క్షత్రియుడు. తమ శక్తిని ఉపయోగించుకుంటుంటాడు. (Energy utilization). నాల్గవ మనిషి బ్రాహ్మణుడు. తన శక్తిని ఎప్పిటికప్పుడు పెంచుకుంటుంటాడు. (Energy accumulation).
మనుషుల్లో సామాన్యంగా మొదటి రెండు రకాల్లో ఉంటారు. వాళ్ళ శక్తిని అనవసరంగా ఖర్చన్నా పెడతారు లేదా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. యోగులకు సూచించినవి మూడు, నాలుగు పద్ధతులు. అవసరం మేరకు శక్తిని ఉపయోగించండి, అవసరం లేనప్పుడు శక్తిని పెంచుకునే పనిని చేపట్టండి అని యోగులకు వారి గురువులు ఉపదేశిస్తారు.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more