Police arrests sri abhaya gold group md and wife

sri abhaya gold group md, abhaya gold group md srinivas, srinivash wife ambhika, police arrest,

police arrests sri abhaya gold group md and wife

అభయ గోల్డ్ ఎండీ చిత్రహింసలు?

Posted: 05/27/2013 04:13 PM IST
Police arrests sri abhaya gold group md and wife

అభయ గోల్డ్ ఎండీ శ్రీనివాస్‌ను మూడు రోజులుగా అక్రమంగా గవర్నరుపేట, సూర్యారావుపేట పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ బలవంతంగా తప్పుడు సమాచారాలు తీసుకొంటున్నారని పోలీసుల అదుపులో వున్న శ్రీనివాస్, ఆయన భార్యను వెంటనే కోర్టులో హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ న్యాయవాది కిలారు బెనర్జీ వేసిన పిటీషన్‌పై చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శ్రీనివాసమూర్తి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. కోర్టులో న్యాయవాది బెనర్జీ వేసిన పిటీషన్‌పై న్యాయమూర్తి కోర్టు కమిషనర్‌ను నియమిస్తూ వెంటనే శ్రీనివాస్, అతని భార్యను పై రెండు స్టేషన్‌లలో వెతికి కోర్టుకు నివేదిక అందచేయాలని ఆదేశించారు.

పిటీషన్‌లో న్యాయవాది బెనర్జీ పేర్కొన్న వివరాలు ఇలా వున్నాయి. మూడు రోజులుగా అభయ గోల్డ్ ఎండీ శ్రీనివాస్, అతని భార్య అంబికను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఆమెకు రెండుసార్లు ఆపరేషన్లు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం గర్భవతిగా వున్న ఆమెకు మెడికల్ చెకప్ కోసం ఈనెల 20న హైదరాబాద్ తీసుకెళ్లగా 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. తొలుత నగరంలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్‌లో వుంచి శ్రీనివాస్, అంబికల పట్ల పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఆమె పరిస్థితి విషమించిందని పేర్కొన్నారు. దీంతో పోలీసులు హరిణి గ్య్రాస్ట్రో ఎంట్రాలజీలో ఆమెను ఇన్‌పేషెంట్‌గా జాయిన్ చేసి చికిత్సలు చేయించారని తెలిపారు. శ్రీనివాస్‌కు ఒంటినిండా గాయాలున్నాయని, సంస్థకు మొత్తం బాకీలు కలిపి రెండు కోట్ల రూపాయల వరకు కూడా లేవని, అయితే రూ.60 నుంచి 70 కోట్ల వరకు ఆస్తులున్నాయని పిటీషన్‌లో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more