విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుంగు అనుచరులు దూరం కావడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. లగడపాటికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయ ప్రకాష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరాలని తీసుకున్న నిర్ణయం ఎంపీ శిబిరంలో పెద్ద కలకలమే చేలరేగింది. ఎంపీపై ఈగ వాలిన తీవ్రంగా స్పందించే అడుసుమిల్లి ఆయనను వదిలి పార్టీ మారాలన్న నిర్ణయం వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయనే వాదన విన్పిస్తోంది. గతంలో ఎంపీ కార్యాలయంలో ఇదే రీతిలో కీలక భూమిక పోషించిన పలువురు సీనియర్‌నేతలు క్రమంగా దూరం అయ్యారు. 2004 నుంచి పలు సీనియర్ నేతలు ఒకప్పుడు ఎంపీ కార్యాలయంలో కీలకపాత్ర పోషించారు. కానీ కార్యాలయంలో కొందరి వ్యక్తులు ప్రవర్తన నచ్చక వారంతా క్రమంగా కార్యాలయానికి దూరం అయ్యారు.2004 నుంచి కొన్ని సంవత్సరాలపాటు ఎంపీ కార్యాలయం ఒక సచివాలయం మాదిరిగా నిర్వహించారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్ సీఈవోగా వ్యవహరించే వారు. ఇప్పుడు సచివాలయం కాదు కాదా సాదా సీదా కార్యాలయ వాతావరణం కూడా లేదు.చాలా మంది నేతలు దూరం అయినట్టుగానే అడుసుమల్లికూడా ఎంపీ కార్యాయలంకు దూరం అయినట్టు సమాచారం. అడుసుమల్లి స్నేహితుడు పొట్లూరి వర ప్రసాద్ వైకాపాతరుఫున విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ముఖ్యనేతలకు కూడా ఎంపి దర్శనం కాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్య అధికారి అనుమతి ఇస్తేనే ఎంపితో మాట్లాడగలిగేది అన్న ప్రచారం ఉంది. దీంతో ఎంపి కార్యాలయం ముఖం చూడటానికి కూడా ఎవ్వరూ సాహసించడంలేదని ఎంపి కోటరీ దెబ్బకు అనుచరగణం దూరం అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలానే ఉంటే కొందరు ముఖ్యనేతలను, అనుచరులను ఎంపి దూరం చేసుకోవాల్సి ఉంటుందని తర్వాత ఏమి చేసిన వారు తిరిగి వచ్చే చాన్స్ ఉండదని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more