పవర్ బంద్ పూర్తిగా విజయవంతమైంది. వామపక్షాల నాయకులు అరెస్టులు మినహా నగరంలో బంద్ పూర్తి ప్రశాంతంగా జరిగింది. తెల్లవారుజామునే వామపక్షాలు, తెలుగుదేశం, బీజేపీ నేతలు స్థానిక పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ డిపో నుంచి సీఎన్జీబస్సులు బయటకు రాకుండా స్థానిక వామపక్ష, తెలుగుదేశం నాయకలు అడ్డుకున్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాల నుంచి బస్సులు కదలలేదు. ఇతర డిపోల నుంచి తక్కువ సంఖ్యలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రజలు కూడా రహదారులపైకి రాలేదు. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు రోజంతా పూర్తిగా మూతపడ్డాయి. చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో అన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని చోట్ల సిబ్బంది విధులకు హాజరైనా యాజమాన్యాలు దుకాణాలను తెరవలేదు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంతం, రామవరప్పాడు సెంటర్, లెనిన్ సెంటర్, గాంధీనగర్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. నగరంలోని అన్ని సినిమా థియేటర్లలో ఉదయం ఆటలను రద్దు చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షడు దేవినేని ఉమామహేశ్వరరావు, సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు, తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్దావెంకన్న తదితరులు పలు ప్రాంతాల్లో మోటారు సైకిల్ ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ నగర వాసులను బంద్‌లో పాల్గొని తమకు సహకరించాలని అభ్యర్థించారు. పలు కూడళ్ళలో నేతలంతా కలిసి మానవ హారాలు, ధర్నాలు నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more