Naga shourya jadugadu movie updates director yogesh

naga shourya news, naga shourya jadugadu movie, jadugadu movie news, jadugadu movie updates, jadugadu movie release date, sonarika stills, sonarika photos, sonarika gallery, sonarika stills, naga shourya sonarika

naga shourya jadugadu movie updates director yogesh : Naga shourya's latest flick jadugadu movie is all set to release in april.

నాగశౌర్య

Posted: 03/10/2015 02:57 PM IST
Naga shourya jadugadu movie updates director yogesh

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సాధించిన యువహీరో నాగశౌర్య.. ఆ తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మీరావే మా ఇంటికి’ వంటి సినిమాలతో క్లాసిక్ హిట్స్ సాధించాడు. దాంతో ఈ నటుడికి క్లాస్ హీరోగా ముద్రపడింది. అయితే.. ఆ ఒక్క ఇమేజ్ తోనే ఇండస్ట్రీలో ముందుకు సాగలేమన్న విషయాన్ని గుర్తించిన ఈ నటుడు.. ఇప్పుడు సరికొత్త తరహా కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

ఇటీవలే యువహీరోలందరూ ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దాంతో వారికి మంచి ఇమేజ్ రావడంతోపాటు వారి సినిమాలకు కలెక్షన్లు కూడా బాగానే వస్తాయన్న నమ్మకం! అటువంటి హీరోల జాబితాలోకి ఇప్పుడు హీరో నాగశౌర్య కూడా చేరిపోయాడు. మొన్నటివరకు ఫ్యామిలీ కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో.. ఇప్పుడు మాస్ ఎంటర్ టైన్ మెంట్ కథతో ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు.

నాగశౌర్య హీరోగా ‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు యోగేష్ దర్శకత్వంలో ‘జాదూగాడు’ చిత్రం రూపొందుతోంది. ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ పతాకంఫై వి.వి.యన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తికాగా.. త్వరలోనే విడుదలకు సిద్ధంగా వుంది.

చిత్ర దర్శకుడు ‘యోగేష్’ మాట్లాడుతూ..’ కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రంలో అతని పాత్ర గతచిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రంలో కధానాయకుడి పాత్రను తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ లో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మరి.. నాగశౌర్య ఈ మాస్ లుక్ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో.. రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga shourya  jadugadu movie updats  sonarika  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more