Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

junior ntr news, junior ntr vedalam movie, vedalam ntr remake news, ajith vedalam movie updates, vedalam movie collections, vedalam movie news, junior ntr vedalam movie

junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood : junior ntr planning to remake ajith's vedalam movie to get huge success again in tollywood.

ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

Posted: 11/19/2015 06:57 PM IST
Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు చేస్తున్నారు. ఆ హిట్ సినిమాలను రీమేక్ చేయడం వల్ల తమ స్టార్ ఇమేజ్ దెబ్బతినకుండా వుంటుందన్న భావనతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పడంలో అనుమానం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఎంతోమంది ఫ్లాప్ హీరోలు రీమేక్ మంత్రాన్ని జపించి, భారీ విజయాలు నమోదు చేసుకున్న సందర్భాలూ చాలానే వున్నాయి. ఆ విషయాన్ని పసిగట్టిన ప్రస్తుత హీరోలు.. ఇప్పుడు ఆ రీమేక్ మంత్రాన్ని జపించే పనిలో పడ్డారు. ఇప్పటికే రామ్ చరణ్ ‘తని ఒరువన్’ రీమేక్ కి సిద్ధమవుతుంటే.. నాగచైతన్య మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ రీమేక్ కి అప్పుడే రంగంలోకి దిగిపోయాడు. ఇప్పుడు వీరి సరసన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ హీరో ఇటీవల తమిళంలో భారీ విజయం సాధించిన ఓ సినిమాకి రీమేక్ చేసే పనిలో పడ్డాడని సమాచారం.

తమిళ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదాళం’ సినిమా.. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం.. తొలి వారంలోనే 45 కోట్లకుపైగా వసూళ్ళని రాబట్టింది. ఈ సినిమాతో అజిత్ కి వున్న మాస్ ఇమేజ్ మరింత పెరిగింది. అతని అభిమానులను ఈ సినిమా ఊర్రూతలూగించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అజిత్ కెరీర్ లో భిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. ఈ సినిమానే ఎన్టీఆర్ తెలుగులో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడట. నిజానికి ఎన్టీఆర్ కి కూడా టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ ఎక్కువగా వుంది. అందువల్ల ఈ సినిమాను తెలుగులో తాను చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలో పడ్డాడట. ఈ సినిమా రీమేక్ కు సంబంధించిన ప్రణాళికలను ఎన్టీఆర్ రహస్యంగా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి.. ఇందులో ఎంతవరకు వాస్తవం వుందో తెలియాలంటే.. స్వయంగా ఎన్టీఆర్ నోరు విప్పితే గానీ తెలీదు. ఒకవేళ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ నిజంగానే రీమేక్ చేస్తే.. అతని ‘మాస్’ అభిమానులకు పండగేనని అనుకుంటున్నారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘టెంపర్’ సక్సెస్ తో అంతవరకు వున్న ఫ్లాప్ ఇమేజ్ ని తుడిచిపారేసిన ఎన్టీఆర్.. ఈ చిత్రంపైనా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం ఎన్టీఆర్ ‘వేదాళం’ రీమేక్ చేస్తాడా..? లేదా..? అన్న విషయం అధికారికంగా వెలువడుతుందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr vedalam remake  ajith vedalam movie updates  

Other Articles

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Thala ajith helps producer mm ratnam by doing movies on his productions

    తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ‘హీరో’నే!

    Nov 17 | తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో అజిత్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరో అనే గర్వం ఏమాత్రం లేకుండా సాధారణ ప్రజలతో సహా మమేకమయ్యే మంచి మనస్తత్వం కలిగిలిన... Read more

  • Telugu hero navdeep got bollywood offer in azhar movie

    బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న తెలుగు హీరో

    Nov 13 | బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని సౌత్ ఇండస్ట్రీలో వుండే నటీనటులు అనుకుంటుంటారు. అందుకే.. స్టార్ హోదాలో వున్నవారు కూడా అక్కడ ఆఫర్లు దక్కించుకోవడం కోసం నానారకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. కేవలం కొంతమందికి... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno