టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన ప్రభాస్ పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నోరకాల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలపై ప్రభాస్ ఏనాడూ స్పందించలేదు. మ్యారేజ్ గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. అతను మాత్రం నవ్వుతూ సైలెంట్‌గా వుండిపోతాడు. బాహుబలి షూటింగ్ సమయంలో మ్యారేజ్ చేసుకోబోతున్నాడంటూ ఆమధ్య ప్రచారం సాగింది. చివరకు ఈ చిత్రం పూర్తి అయ్యేవరకు అతను పెళ్లి చేసుకునే అవకాశాలు లేవని అప్పుడే తేలిపోయింది. బాహుబలి రిలీజ్ కావడం, ప్రభాస్ వివాహం చేసుకోవడం రెండూ ఒకేసారి జరిగే సూచనలున్నాయని ఇంటర్నెట్, మీడియాలో వార్తలొచ్చాయి.
ఆ విషయాలెలావున్నా.. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ హీరో పెళ్లికొడుకు కాబోతున్నాడని, బంధువుల అమ్మాయితో వివాహం చేసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో వుండే తన బంధువుల అమ్మాయిని మ్యారేజ్ చేసుకునేందుకు ప్రభాస్ ఓకే చేశాడని వార్తలు వెలువడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌లో ఈ హీరో వివాహం జరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి.. ప్రభాస్ ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేడా..? లేదా..? ఈ వార్తలు కూడా రూమర్లేనా..? లేకా నిజమా..? అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే!
ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా ప్యాచ్ వర్కుల్లో బిజీగా వున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ సినిమా, అలాగే దశరథ్ లతో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! ఆ రెండు మూవీల స్ర్కిప్ట్ వర్క్ లు జరుగుతున్నాయని తెలిసింది!
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more