Junior ntr sukumar rakul preet singh movie uk schedule producer bvsn prasad

junior ntr news, junior ntr sukumar movie, junior ntr latest movie news, rakul preet singh news, sukumar news, bvsn prasad

junior ntr sukumar rakul preet singh movie uk schedule producer bvsn prasad : Junior ntr and sukumar movie first schedule in uk because of script. rakul is fixed as actress in this movie.

జూనియర్ ఎన్టీఆర్

Posted: 02/21/2015 07:57 PM IST
Junior ntr sukumar rakul preet singh movie uk schedule producer bvsn prasad

గతకొన్నాళ్ల నుంచి ఒక్క హిట్ దక్కక తీవ్ర ఆందోళనల్లో మునిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ కి.. ‘టెంపర్’ చిత్రం కాస్త ఊరటనిచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యంగ్ టైగర్ మళ్లీ తిరగొచ్చాడంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక విమర్శకులు సైతం చిత్రం బాగా వుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ నటన అద్భుతంగా వుందని ప్రశంసించారు. దీంతో ఎన్టీఆర్ ఈ తరహాలోనే మరిన్ని విజయాలు సాధించాలని ఫిక్స్ అయ్యాడు.

ఇకపోతే.. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు చివరదశకు చేరుకున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగును ప్రారంభించడానికి యూనిట్ బృందం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది కూడా! ఇదిలావుండగా.. ఈ చిత్రం కథ ప్రకారం మేజర్ షూటింగ్ పార్ట్ యూకేలోనే వుంటుందని సమాచారం! అందుకే.. అక్కడికెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట! కొన్నాళ్లపాటు అక్కడే వుండి భారీ షెడ్యూల్ ని నిర్వహిస్తారని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిక్స అయ్యింది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు ‘నేనొక్కడినే’ మూవీతో పరాభావం ఎదుర్కొన్న దర్శకుడు సుకుమార్.. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అన్నట్టు.. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త స్టైలిష్ లుక్ లో దర్శనమివ్వనున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr latest movie  sukumar movies  rakul preet singh latest news  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more