‘లౌక్యం’ సినిమాతో భారీ హిట్ అందుకున్న గోపీచంద్.. ప్రస్తుతం ‘జిల్’ మూవీ చిత్రీకరణలో బిజీగా వున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని యు.వి.క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తోంది.
‘రన్ రాజా రన్’ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రన్.. ఈ చిత్రానికి పాటలు సమకూరుస్తున్నాడు. ఇక గోపీచంద్ సరసన హీరోయిన్ గా ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశిఖన్నా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరులో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు.
ఈ సినిమాలో గోపీచంద్ సరికొత్త లుక్ లో ప్రేక్షకులను అలరించనున్నాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే సరికొత్త ఎలిమెంట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని, గోపీచంద్ క్రేజ్ ని మరింతగా పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more