• చిత్రం  :

    రంభతో రాముడు

  • బ్యానర్  :

    ఫ్లయింగ్ క్యాట్ పిక్చర్స్

  • దర్శకుడు  :

    అభిరామ్ పిల్ల

  • నిర్మాత  :

    ఫ్లయింగ్ క్యాట్ పిక్చర్స్

  • సంగీతం  :

    ఆండీ హ్యామర్ హెడ్

  • ఛాయాగ్రహణం  :

    శ్రీకాంత్ అర్పుల

  • ఎడిటర్  :

    వంశీ పట్నాలా

  • నటినటులు  :

    రవిశివ తేజపైల, జాహ్నవీ దాసెట్టి, కార్తీక్ రెడ్డి

Rambhatho Rambabu Short Film Movie Review
Cinema Story

ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేసుకునే కుటుంబం. ఒకనాడు రైతుకు పట్టణంలో వున్న కొడుకు నుంచి ఫోన్ వస్తుంది. తన కాలేజ్ ఫీజ్ కోసం రూ.50,000 రూపాయలు త్వరగా పంపించాల్సిందిగా కసురుకుంటూ మరీ ఆర్డర్ చేస్తాడు. కొడుకు చదువుకోసం ముందువెనుకా ఆలోచించకుండా తన భూమిలో సరిగ్గా పంటలు పండకపోయినప్పటికీ... ఆ రైతు తండ్రి ఒక వడ్డీ వ్యాపారి దగ్గర రూ.10 వడ్డీ చొప్పున రూ.50,000 అప్పుగా తీసుకుంటాడు. అలాగే అతనికి భూముల పత్రాలు కూడా సమర్పించుకుంటాడు. నెలనెల సరిగ్గా వడ్డీ కట్టకపోతే ఆ భూమి తనకే సొంతం అవుతుందని ముందుగానే హెచ్చరిస్తాడు. అయినాకూడా తన కొడుకు పట్టణంలో ఉద్యోగం చేసి అప్పు తీరుస్తాడనే నమ్మకంతో సరేనని ఒప్పుకుంటాడు. ఆ డబ్బుల్ని తన పట్టణంలో వున్న తన కొడుకు రాముడుకి పంపిస్తాడు.

అయితే అతను జల్సాకోసం ఫీజుపేరు మీద అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంటాడు. డబ్బుల ఆశలో ఫ్రెండ్ కి కూడా వ్యాల్యూ ఇవ్వడు. అయితే ముక్కూమొహం తెలియని ఒక అమ్మాయికి ఆ డబ్బులు మొత్తం ధారబోస్తాడు. ఆమె అతనికి దొంగనెంబరు ఇచ్చి అక్కడినుంచి ఉడాయిస్తుంది. అతను ఆమె ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేస్తే స్విచాఫ్. ఆ తర్వాత ఆ అమ్మాయి అతనికి దొరకుతుందా..? అతని డబ్బులు తిరిగొస్తాయా..? రాముడు తండ్రికి అప్పిచ్చిన వడ్డీ వ్యాపారి వాళ్ల భూమిని కబ్జా చేసుకుంటాడా..? చివరకు ఏమవుతుంది..? అన్న కథాంశంతోనే ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించడం జరిగింది.

cinima-reviews
రంభతో రాముడు!

విశ్లేషణ : ప్రస్తుతకాలంలో యుక్తవయస్సులో వున్న అబ్బాయిలు తమ అమ్మానాన్నలను ఖాతరు చేయకుండా అమ్మాయిల వెంటపడుతూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుంటారు. పిల్లలు పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రులు వారికోసం పడే కష్టాలు, ఎదుర్కొన్న నష్టాల గురించి పట్టించుకోకుండా ఆవారాల్లాగా గల్లీల్లో తిరుగుతుంటారు. అటువంటి వారిని ఉద్దేశించే ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. అమ్మానాన్నాలను కాదని అమ్మాయిల వెంటపడితే కలిగే నష్టమేంటో స్పష్టంగా ఇందులో పొందుపరిచారు. ఫ్లైయింగ్ క్యాట్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి అభిరామ్ పిల్ల దర్శకత్వం వహించారు. నేటి యువతరానికి స్ఫూర్తి కల్పించే దిశగా ఈ షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించిన వైనం అద్భుతం.