• చిత్రం  :

    అలా మొదలైంది

  • బ్యానర్  :

    ఏ నూమెరో యూనో ఎంటర్ టైన్’మెంట్స్

  • దర్శకుడు  :

    వినయ్ అండ్ ఆదిత్య

  • సంగీతం  :

    ఆంటోన్ జెఫ్రిన్

  • ఛాయాగ్రహణం  :

    చేతన్

  • ఎడిటర్  :

    వినయ్ వివేక వర్ధన్

  • నటినటులు  :

    భావన రావ్, వినయ్ వివేక వర్ధన్

Ala Modalaindi Short Film Review
Cinema Story

సీన్ ఓపెన్ చేయగానే.. వివేక్ అనే అబ్బాయి బైక్ పాడైపోతుంది. ఆ రహదారిలో ఆటోలు కూడా వుండవు. దాంతో అతగాడు ఎవర్నైనా లిఫ్ట్ అడగాలనే నిర్ణయంతో వెయిట్ చేస్తాడు. చాలాసేపటి తర్వాత ఒక కార్ ఎంట్రీ ఇస్తుంది. లిఫ్ట్ కోసం చేయి ఊపగా కొద్దిదూరం వరకు వెళ్లి.. తిరిగి వెనక్కు వస్తుంది. అందులో భావన అనే అమ్మాయి! ‘లిఫ్ట్ అడిగారు కదా కూర్చోండి’ అని అంటుంది. అందంగా వున్న అమ్మాయిని చూసి వివేక్ పడిపోతాడు.

తన మనసులోని మాటను వ్యక్తపరచాలని అనుకుంటాడుగానీ కుదరదు. ఇంతలోనే అతడు దిగాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. అయితే తనకు లిఫ్ట్ అడిగినందుకు ఆ అమ్మాయికి చాయ్ ఆఫర్ చేస్తాడు. అందుకు అమ్మాయి ఓకే అనగానే ఇద్దరూ ఫ్లాట్’లోకి వెళ్తారు. ఇద్దరూ చాయ్ తాగుతూ కాసేపు సరదాగా మాట్లాడిన అనంతరం భావన బయలుదేరుతుంది. తను కింద దిగి తన కార్ దగ్గరికి వెళ్లిపోతుంది. ‘ఫోన్ నెంబర్ కూడా ఇప్పించుకోలేదే’ అన్న డైలామాలో వివేక్ వుండిపోతాడు.

ఇంతలోనే ఒక ట్విస్ట్.. అప్పుడే వివేక్’కి ఒక మెసేజ్ వస్తుంది. అదిచూసి అతడు ఒక్కసారిగా షాకవుతాడు. అసలు అతనికి ఏం మెసేజ్ వచ్చింది..? అతడు భావనను మళ్లీ కలుసుకుంటాడా..? అనే విషయాలు తెలియాలంటే.. షార్ట్ ఫిలిం చూడాల్సిందే!

cinima-reviews
అలా మొదలైంది

ఈమధ్య యువతీయువకుల మధ్య ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే వ్యవహారం బాగానే సాగుతోంది. ఎవరూ..? ఏం చేస్తారు..? అసలు వాళ్ల బ్యాక్’గ్రౌండ్ ఏంటి..? అనే విషయాలు తెలుసుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఇందులో చాలావరకు అబ్బాయిలే ముందుంటారు కానీ.. ఇటీవలే అమ్మాయిలు కూడా పెరిగిపోయారు. హ్యాండ్’సమ్ వున్నాడు.. మహేష్ బాబులా.. వున్నాడు అంటూ వెంటపడిపోతుంటారు. ఏదైతేనేం.. చివరకు తమ ప్రేమ సక్సెస్ అయేంతవరకు వదలరులెండి!

ఇక సినిమా విషయానికొస్తే.. ‘అలా మొదలైంది’ అనే సినిమా కథాంశం తరహాలోనే ఈ షార్ట్ ఫిలింని స్వీట్’గా రూపొందించారు. ఎక్కువ పాత్రలు లేకుండా సింపుల్’గా రెండు క్యారెక్టర్లతోనే తక్కువ టైమింగ్’తో నడిపించేశారు.