• చిత్రం  :

    నాకు కోపం వచ్చింది

  • బ్యానర్  :

    ఐక్లిక్ మూవీస్

  • దర్శకుడు  :

    శ్రీకాంత్ ఎన్.రెడ్డి

  • నిర్మాత  :

    శైలజారెడ్డి

  • నటినటులు  :

    సుదర్శన్ రెడ్డి, కార్తీక్ చౌదరి, ఫణీంద్ర, చిరంజీవి

Naaku Kopam Vachindi Telugu Short Film Review
Cinema Story

సీన్ ఓపెన్ చేస్తే.. ఒక కారు. అందులో కార్తీక్ అనే అబ్బాయి. తను కార్ నడుపుకుంటూ వస్తుండగా సడెన్ గా టైర్ పగిలిపోతుంది. అంతే... కార్తీక్ కి కోపం వచ్చేస్తుంది. ఒక నెలలోనే మూడుటైర్లు వరుసగా పగలడంతో చిర్రెత్తుకుపోతాడు. సీన్ కట్ చేస్తే.. సుదర్శన్, ఫణి అనే ఇద్దరు స్నేహితులు! ఒకర్నొకరు పంచ్ లేసుకోవడం తప్ప.. దేనికి పనికిరారు. ఒకనాడు ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళితే.. ఆ సమయంలో ఎవ్వరూ వుండరు. ఇద్దరు కలిసి పనిచేసుకుంటూ వుంటారు. అదే సమయంలో ఇంటర్వ్యూ కోసమని ఒక అమ్మాయి అక్కడకు వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయిని పడేయడానికి ఇద్దరు ప్రయత్నిస్తే.. అందులో సుదర్శన్ పడేస్తాడు. సీన్ కట్ చేస్తే.. ఉదయాన్నే వారిద్దరికీ అనుకోకుండా బ్రేక్ అప్. అలా అయినందుకు బారుకెళ్లి బాధపడుదామని ఇద్దరు అనుకుంటారు.

బయలుదేరడానికి సిద్ధంగా వుండగా.. కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ముగ్గురు కలిసి పార్టీకి వెళదామని ఫిక్స్ అవుతారు. అయితే అదే సమయంలో కార్తీక్ కి ఫోన్ రావడంతో.. దారిలో కాస్త పని ముగించుకుని పార్టీకెళదామని నిర్ణయించుకుంటారు. సీన్ కట్ చేస్తే... పోలీస్ స్టేషన్ ముగ్గురు దర్శనమవుతారు. బార్ కు వెళ్లాల్సిన ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళతారు..? దారిలో ఏమైనా యాక్సిడెంట్ గొడవ జరిగిందా..? అసలు సుదర్శన్ ని తన గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వదిలేసింది..? మధ్యలో ఫణీంద్ర క్యారెక్టర్ ఏంటి..? స్టేషన్ కు వెళ్లిన ఆ ముగ్గురికి ఏం జరుగుతుంది..? అసలేమైందని వాళ్లు స్టేషన్ కు వెళ్లారు..? అన్న కోణంలో ఈ షార్ట్ ఫిలింని రూపొందించారు.

cinima-reviews
నాకు కోపం వచ్చింది

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కాస్త పక్కనపెడితే.. మానవునికి లభించాల్సిన కనీస అవసరాలను కూడా ప్రభుత్వం తీర్చడంలో విఫలమవుతోంది. అది నగరంలో కావొచ్చు లేదా పల్లెటూర్లలో కావొచ్చు. రహదారుల నిర్మాణ విషయంలోగానీ, కరెంటు సప్లై వ్యవహారంలోగానీ, నీటి విడుదల సమస్యపై గానీ.. పూర్తిగా నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వడం లేదు. ఒకరోజు వరకు బాగుంటే.. తర్వాత వారంరోజుల వరకు ఆ సమస్యలను ఎదుర్కోవాల్సి వుంటుంది. ప్రభుత్వానికి అందాల్సిన ట్యాక్స్ సామాన్య మానవుని నుంచి ధనికులందరూ కడుతున్నారు. అయినా మానవ వనరుల్ని పూర్తిగా సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. దాంతో ప్రజలకు తీవ్ర నిరాశకు గురవ్వడంతోపాటు ఎన్నో తప్పిదాలు చేస్తున్నారు. అటువంటి వ్యవహారాలను దృష్టిలో పెట్టుకునే ఈ షార్ట్ ఫిలింని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇందులో నటించిన నటీనటులందరూ సాధ్యమైనంతవరకు బాగానే నటించి, వీక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా ఇందులో సుదర్శన్ క్యారెక్టర్ సూపర్బ్. అతని డైలాగ్ డెలివరీ, మాటలతీరు బాగానే కవ్వింతలు పెట్టిస్తాయి. అలాగే అతనితోపాటు వుండే ఫణీంద్ర కూడా ఓ మోస్తరువరకు బాగానే నటించాడు. సుదర్శన్ కు సహాయకుడిగా గుడ్ అనిపించుకున్నాడు. ఇక కార్తీక్ కాస్త సీరియస్ రోల్ కాబట్టి.. అందులో అతను బాగానే సూట్ అయ్యాడు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ చిన్నదే! మొత్తానికి ఇది సందేశాత్మకమైన కామెడీ ఎంటర్ టైనర్ షార్ట్ ఫిల్మ్!