Micromax launches 'Bharat 5' for Rs 5,555 రెడ్ ఎంఐ 5ఎ కు ధీటుగా మైక్రోమాక్స్ భారత్ 5

Micromax bharat 5 with 5000mah battery launched

micromax bharat 5 price india launch specifications feature offers micromax,micromax bharat 5,micromax bharat 5 price,micromax bharat 5 price in india,micromax bharat 5 specifications,mobiles,android, micromax, bharat 5, android, smart phones, mobiles, technology, business

Expanding its affordable "Bharat" series, Micromax Informatics on Friday launched "Bharat 5" smartphone for Rs 5,555.

రెడ్ ఎంఐ 5ఎ కు ధీటుగా మైక్రోమాక్స్ భారత్ 5

Posted: 12/01/2017 07:06 PM IST
Micromax bharat 5 with 5000mah battery launched

చైనా మొబైల్ మేకర్ షియోమి రెడ్ ఎంఐ 5 ఎకు ధీటుగా స్వదేశీ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. భారీ బ్యాటరీతో బడ్జెట్ దరలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కు  భారత్ 5 అని నామకరణం చేసింది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో లాంఛ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేవలం రూ.5555 ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ లాంచ్ లో వొడాఫోన్ తో  భాగస్వామ్యంలో డేటాను కూడా ఆఫర్ చేస్తుంది.

ఈ ఆఫర్ ప్రకారం ఐదు మాసాల పాటు నెలకు 10 జీబి డాటాను కూడా అందించనుంది. భారత్-సీరీస్లో భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 2018 నాటికి 6 లక్షల  యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఫోన్లు దేశంలోని ఆఫ్ లైన్ రిటైలర్లు ద్వారా మాత్రమే అందుబాటులో వుండనున్నాయి. దీంతో రీటైల్ మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సి వుంటుంది.

మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్, చీఫ్ మార్కెటింగ్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ మాట్లాడుతూ .. భారత్‌5  సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు  స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో తరువాత దిశగా భారత్ ను తీసుకెళతాయని అశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‌విద్యుత్తు అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్న 3-4 టైర్‌ నగరాల్లో తమ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్‌లు కీలకంగా నిలుస్తాయన్నారు. అయా నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో తమ నూతన ఉత్పాదనకు అదరణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మైక్రోమ్యాక్స్ భారత్ 5 స్పెసిఫికేషన్లు:-

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌
1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ నౌగాట్‌
720x1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
1జీబీ  ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
16జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
5 మెగాపిక్సెల్‌ బ్యాంక్‌ అండ్‌ ఫ్రంట్‌  కెమెరాలు విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : micromax  bharat 5  android  smart phones  mobiles  technology  business  

Other Articles