Xiaomi Redmi 5A launched in India షియోమీ నుంచి దేశ్ కా స్మార్ట్ ఫోన్ రెడ్ ఎంఐ 5ఎ

Xiaomi redmi 5a launched as desh ka smartphone

Xiaomi, Xiaomi Redmi 5A, Redmi 5A launched, Redmi 5A specs, android, qualcomm, snapdragon, Redmi 5A india price, Redmi 5A features, desk ka smartphone, e-commerce, Flipkart, smart phones, mobiles, technology, business

Xiaomi Redmi 5A has been launched in India. Marketed as the 'Desh ka Smartphone' in the country, the Redmi 5A has an entry-level price tag as well as specifications.

షియోమీ నుంచి దేశ్ కా స్మార్ట్ ఫోన్ రెడ్ ఎంఐ 5ఎ

Posted: 11/30/2017 06:28 PM IST
Xiaomi redmi 5a launched as desh ka smartphone

భారతీయ మ్కారెట్లో రికార్డు స్థాయి అమ్మాకాలతో తనదైన ముద్రను వేసుకుంటూ దూసుకెళ్లున్న చైనా మొబైల్‌ తయారీ సంస్థ షియోమీ.. రెడ్‌మి నోట్‌4 తో స్మార్ ఫోన్ విక్రయాలలో ఇప్పటికే ప్రభంజనాన్ని సృష్టించింది. దీంతో మంచి ఊపు మీదున్న షియోమి సంస్థ మరో కొత్త మోడల్ ను భారత విఫణిలోకి ప్రవేశపెట్టింది. ‘దేశ్ కా స్మార్ట్ ఫోన్‌’ పేరుతో ‘రెడ్‌మి 5ఏ’ మొబైల్ ను రూ.5వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గురువారం జరిగిన ఈ ఫోన్‌ విడుదల కార్యక్రమంలో ధర, ఫీచర్లను రెడ్‌మి ఇండియా వెల్లడించింది.

‘‘స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలో షియోమి ఇండియా ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ.500కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వనుంది. అందులో భాగంగానే తొలి 50లక్షల రెడ్ మి 5ఏ(2జీబీ+16బీజీ)ను రూ.4,999కే అందించనున్నాం’’ అని రెడ్ మి ఇండియా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. డిసెంబర్‌ 7 మధ్యాహ్నం 12గంటలకు భారత ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్‌ ప్రారంభం కానుందని వెల్లడించింది.

రెడ్‌మి 5ఏ స్పెసిఫికేషన్లు..

* 5 ఇంచుల హెచ్ డీ టచ్ స్ర్కీన్
* స్నాప్ డ్రాగన్‌ 425 ప్రాసెసర్
* 2జీబీ ర్యామ్
* 16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు పెంచుకునే సదుపాయం
* 5 ఎంపీ, 13 ఎంపీ ముందు వెనుక కెమెరాలు
* ఆండ్రాయిడ్ నోగట్‌, ఎంఐయూఐ 9 వెర్షన్
* మెమొరీకార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్
* 3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  Redmi 5A  e-commerce  Flipkart  mobiles  technology  business  

Other Articles