Nokia 8 launcher in Indian Market బోతిస్ ఫీచర్ తో నోకియా-8.. భారతీయ విఫణిలోకి..

Nokia 8 with snapdragon 835 soc dual cameras launched in india

Nokia 8, Nokia 8 India,Nokia 8 price, Nokia 8 features, Nokia 8 competitor, OnePlus 5, Galaxy S7, IP54 splash proof, HMD Global, Android smartphone, mobiles, smartphones, E-commerce, business, technology

The Nokia 8 - Nokia's much awaited Android flagship smartphone has finally landed in India. At a disruptive price of Rs 36,999.

బోతిస్ ఫీచర్ తో నోకియా-8.. భారతీయ విఫణిలోకి..

Posted: 09/26/2017 06:31 PM IST
Nokia 8 with snapdragon 835 soc dual cameras launched in india

ఫీచర్ ఫోన్ల సామ్రాజ్యంలో ఒక ఊపు ఊపిన నోకియా.. స్మార్ట్ ఫోన్ రాకతో మరుగున పడినా.. మళ్లీ తన పూర్వవైభవాన్ని అందుకోవాలని సరికోత్త అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తో అభిమానుల ముంగిట్లోకి వచ్చేసింది. ఎంతో కాలంగా ఇప్పుడు, అప్పుడు అంటూ వేచిచూస్తున్న స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో తన తొలి హైఎండ్‌ స్మార్ట్ ఫోన్ ను భారతీయ విపణిలో అవిష్కరించింది. ఇప్పటి వరకు ఏ స్మార్ట్ ఫోన్ కు లేని ఫీచర్ బోతిస్ తో స్మార్ట్ ఫోన్ అభిమానులను అకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

భారతీయ విపణీలో నోకియా 8 స్మార్ట్ ఫోన్ ధర అందరూ ముందుగా ఊహించనట్టు నలభై వేల రూపాయలు, లేదా 36 వేల రూపాయలు కాకుండా అంతకన్న తక్కువగా కేవలం రూ.32.999లకే అందుబాటులోకి తీసుకురానుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఇవాళ భారతీయ విఫణిలో విడుదల చేసినట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. టాప్‌-ఎండ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ, వెనుకవైపు రెండు కెమెరాల సెటప్‌, ప్రీమియం యూనిబాడీ డిజైన్‌, బోతీస్‌ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది.

వచ్చేనెల 14 నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఆన్ లైన్ లో ప్రత్యేకంగా అమెజాన్ లో దీన్ని విక్రయించనున్నారు. అంతేకాక క్రోమా, రిలయన్స్, సంగీత మొబైల్స్‌, పూర్వికా, బిగ్ సీ వంటి ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉండనుంది. అయితే నోకియా తొలి హైఎండ్ ఫోన్ కు వన్ ప్లస్ 5 పోటీగా నిలవనుంది. ఇక నోకియా 8 స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు జియో అదనపు డేటా 100 జీబీని అందించనున్నట్లు ప్రకటించింది.

నోకియా 8 స్పెసిఫికేషన్లు....

ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
డ్యూయల్‌ సిమ్‌(నానో)
5.3 అంగుళాల క్యూహెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్‌ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌​ 835 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో వెనుక వైపు రెండు కెమెరాలు
13 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
బోతిస్ ఫీచర్ ఏర్పాటు.. ఒకేసారి ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలను వాడే సుదుపాయం
4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ
3090ఎంఏహెచ్‌ నాన్‌-రిమూవబుల్‌ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nokia 8  Indian Market  Nokia 8 price  features  Galaxy S7  HMD Global  smartphone  E-commerce  business  technology  

Other Articles