Sensex ends over 430 pts lower, Nifty closes below 9800 భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు..

Sensex tanks 440 points as army conducts surgical strike

BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The Sensex closed down 439.95 points or 1.39% at 31159.81, while the Nifty ended lower by 135.75 points or 1.38% at 9735.75. The market breadth was negative as 582 shares advanced against a decline of 1,951 shares, while 135 shares were unchanged.

భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు..

Posted: 09/27/2017 07:34 PM IST
Sensex tanks 440 points as army conducts surgical strike

ప్రపంచ మార్కెట్ల గమనం సానుకూల దిశగా సాగుతున్న క్రమంలో యుద్ద సన్నాహాలకు ఉత్తర కోరియా సిద్దమై వైమానిక దళ విన్యాసాలు చేయంచడంతో ఒక్కసారిగా అవి తిరోగమనం వైపు పయనించాయి. ఇక తాజాగా మయన్మార్‌ సరిహద్దుల్లో భారత సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య భీకర పోరుతో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టకున్నాయి. మయన్మార్ సరిహద్దులో భారత ఆర్మీ సర్జికల్ దాడులను చేసి నాగా తీవ్రవాదులను అణిచివేస్తుందన్న వార్తలతో మార్కెట్లు కుదేలయ్యాయి.

సెప్టెంబర్ డెరివేటివ్ల గడువు ముగింపు నేపథ్యంలో ఆరంభం నుంచే డీలా పడ్డ సూచీలు.. తాజాగా మయన్మార్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో నిన్నటి క్లోజింగ్ తో పాల్చితే సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 9,800 కిందకు దిగజారింది. ఇవాళ ఉదయం ఆరంభంలో మార్కట్ స్వల్ప లాభాలతో ప్రారంభమైనా అవి ఎంతోసేపు నిలువలేదు.

సెప్టెంబర్ వెరివేటివ్ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న వార్తలు దవాణంలా వ్యాపించడంతో ఒక్కసారిగా మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో ముగింపు సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు కోల్పోయి.. 31,160 మార్కు వద్దకు చేరుకోగా, నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 9,736 పాయింట్ల వద్ద జారుకున్నాయి. కాగా, భారతీ ఇన్ ఫ్రాటెల్‌, టీసీఎస్, టెక్ మహింద్రా, అంబుజా సిమెంట్‌, గెయిల్‌ సంస్థల షేర్లు స్వల్పంగా లాభపడగా.. అదానీ పోర్ట్స్‌, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సన్ ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్ సంస్థల షేర్లు అత్యధిక నష్టాలను చవిచూశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  nse  bse  stock market  global markets  myanmar  business  

Other Articles