భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు Nifty ends at 8247, Sensex up 457 pts

Nifty ends at 8247 sensex up 457 pts

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The benchmark BSE Sensex ended the day up 457 points at 26,694 and the Nifty50 settled 145 points higher at 8,247.

భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

Posted: 12/08/2016 09:35 PM IST
Nifty ends at 8247 sensex up 457 pts

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా లాభాలను గడించాయి. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాల ప్రభావంతో దేశీయ సూచీలు ఎగబాకాయి. కేంద్రం పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత మార్కెట్లు ఇంతటి లాభాలను అర్జించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సానుకూల పవనాలతో మార్కట్లు ఎగిసాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగబాకగా, ఇటు నిఫ్టీ కూడా కీలకమైన 8200 మార్కును అధిగమించింది.

ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాలలో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 300 పాయింట్లకు పైగా ర్యాలీ జరిపడంతో అటు నిఫ్టీ సైతం 8200 స్థాయిని పునరుద్ధరించుకుని ట్రేడ్ అయింది. అయితే అందివచ్చిన లాభాలను అధిమిపట్టుకున్న సూచీలకు అంతర్జాతీయంగా వచ్చిన పాజిటివ్ సంకేతాలు తోడయ్యాయి. దీంతో మార్కెట్లు లాభానలు గడించాయి. అటు అమెరికా పెడరల్ రిజర్వు ద్రవ్యపరపతి సమీక్షలో వడ్డీ రేట్లను పెంచుతుందన్న వార్తలు.. ఇటు యూరోపియన్ క్యాపిటల్ బ్యాంకు కూడా మదుపురులకు అనూగూనంగా చర్యలు తీసుకుంటుందన్న సంకేతాలతో మార్కెట్లు లాభాలను గడించాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 457 పాయింట్లు లాభంతో 26 వేల 694 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 8వేల 248 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ నేపథ్యంలో అటో, బ్యాంకింగ్ రంగాలు ర్యాలీని కొనసాగించింది. ఇవాళ అన్ని సూచీలు లాభాలను గడించాయి. ఇక సెన్సెక్స్ లో అన్ని సంస్థల షేర్లు కూడా భారీ లాభాలను అందుకున్నాయి. కాగా బ్రాడర్ మార్కెట్లయిన మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలలోని కేవలం నాలుగు సంస్థల షేర్లు మాత్రమే నష్టాల్లలో ముగిసాయి. ఈ క్రమంలో టాటా స్టీల్, టాటా మోటార్స్ డీజిల్, టాటా మోటార్స్, అదాని పోర్ట్స్, బాస్చ్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, భారతి ఇన్ఫ్రాటెల్, ఏషియర్ మోటార్స్, అరబిందో ఫార్మ, ఎన్టీపీసీ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles