అర్బీఐ ప్రకటనతో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు Disappointing RBI move drags Sensex 156 pts

Sensex falls 156 points after rbi policy review bank stocks hit hard

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

The benchmark Sensex reversed its two-day rally as it fell 156 points on Wednesday to end at 26,237 as RBI left interest rate unchanged at 6.25%, contrary to market expectations

వడ్డీరేట్లు యధాతథ ప్రకటనతో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు..

Posted: 12/07/2016 07:06 PM IST
Sensex falls 156 points after rbi policy review bank stocks hit hard

లాభాలబాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాలలోకి జారుకున్నాయి. మార్కెట్ దారుల అంచనాలకు చెక్ పెడుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని మానిటరింగ్ కమిటీ తీసుకన్న నిర్ణయంతో లాభాల్లో పురోగమించిన మార్కట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుని వరుసగా రెండు రోజుల సాధించిన లాభాలను కోల్పోయాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువరించే మొదటిపాలసీపై భారీగా ఆశలు పెట్టుకున్న రేట్ సెన్సిటివ్ రంగాల షేర్లకు ఆర్బీఐ నిర్ణయంతో షాకిచ్చింది.

కీలక వడ్డీరేట్లు రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడంతో ఆ రంగాల షేర్లన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న లాభాలన్నీ ఈ ప్రకటనతో  తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు వరకు లాభాల్లో నడిచిన కెనరా బ్యాంకు, ఐడిబీఐ,  ఓబీసీ, పీఎన్బీ, కొటక్ మహింద్రా, సిండికేట్, యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఎస్బీఐలు పడిపోయాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం క్షీణించి 17,953  పాయింట్లకు దిగజారింది..

ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాలలో దూసుకెళ్లిన మార్కెట్లు ఆ తరువాత తిరోగమనం బాటపట్టాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 300 పాయింట్లకు పైగా ర్యాలీ జరిపింది. నిఫ్టీ సైతం 8200 స్థాయిని పునరుద్ధరించుకుని ట్రేడ్ అయింది. అయితే అందివచ్చిన లాభాలను అధిమిపట్టుకోవడంలో విఫలమైన మార్కెట్లు చివరకు తటస్థంగా ముగిసాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 6 పాయింట్లు నష్టంతో 26 వేల 299 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 8వేల 112 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8100 మార్కుకు ఎగువకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో అటో రంగం ర్యాలీని కొనసాగించింది. అటో రంగంపై, అర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం నామమాత్రంగానే వుంది. అయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, కన్జూమర్ డూరబుల్స్ సూచీలు లాభాలను అర్జిచాయి. కాగా బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ హెల్త్ కేర్ సూచీలు మాత్రం భారీగా దెబ్బతిన్నాయి, దీంతో పాటు క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, ఐటీ, టెక్నాలజీ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రామల సమాఖ్యలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.

ఈ క్రమంలో ఏషియర్ మోటార్స్, బిపిసీఎల్; అదాని పోర్ట్స్, హెచ్ డీ ఎఫ్ సీ, ఐడియా సెల్యూలార్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, సన్ ఫార్మ, బ్యాంక్ అప్ బరోడా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles