apple unseats xiaomi in chinese market to become number one

Apple surpasses xiaomi in china s smartphone market idc

Apple, Samsung, huawei", Xiaomi, lenovo, China, Business, Markets, china, business news, china, idc, mobiles,

Apple has overtaken China's Xiaomi to become the largest vendor of smartphones in the Chinese market for the first time, new data showed on Monday

చైనా మార్కెట్ లో నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించిన యాపిల్

Posted: 05/11/2015 06:24 PM IST
Apple surpasses xiaomi in china s smartphone market idc

చైనా యాపిల్ సంస్థగా పేరొందిన షియోమిని అక్కడి మార్కెట్ లో తొలిసారిగా ఎదురు దెబ్బ తగిలింది. చైనా మార్కెట్ వర్గాలు అసాధ్యమనుకున్న పనిని యాపిల్ సంస్థ చేసి చూపింది. అదేంటంటే.. చైనా షియోమీని యాపిల్ సంస్థ అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒక్కటైన చైనాలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు విక్రయించిన కంపెనీగా యాపిల్ నిలిచింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14.7 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సాగించిన యాపిల్ సంస్థ.. చైనా మార్కెట్ లో అన్ని స్మార్ట్ ఫోన్ సంస్థలకన్నా ముందు నిలిచింది

కాగా, యాఫిల్ సంస్థతో పోటీ పడిన షియోమి 13.7 శాతం అమ్మకాలతో రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. హువాయ్, సామ్ సంగ్, లెనోవో స్మార్ట్ ఫోన్ సంస్థలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్-5 కంపెనీలు కలిపి జనవరి-మార్చిలో 57.8 శాతం అమ్మకాలు సాగించినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో యాపిల్, షియోమి, హువాయ్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఐడీసీ తెలిపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  china  Xiomi  Apple  

Other Articles