The Best foods for healthy skin in summer | Beauty Tips | Skincare Tips

Best foods for healthy skin in summer beauty skincare tips

beauty tips, beauty skincare tips, skincare tips, healthy skin tips, summer health tips, skincare health tips, best foods for skin, skin best foods, salmon fish beauty benefits, tomato beauty benefits, tomato skin tips

Best foods for healthy skin in summer Beauty Tips Skincare Tips : The Best foods for healthy skin in summer.

హెల్దీ స్కిన్ కోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్

Posted: 05/13/2015 02:57 PM IST
Best foods for healthy skin in summer beauty skincare tips

వేసవికాలంలో చర్మసంబంధిత వ్యాధులు అధికమవుతాయి. చర్మం పొడిబారిపోవడం, సన్-టాన్, మొటిమలు రావడం, నల్లని మచ్చలు ఏర్పడటం, సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావానికి చర్మం సహజత్వం కోల్పోవడం.. ఇంకా రకరకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వీటి నుంచి రక్షణ పొందేందుకు బ్యూటీ ప్రోడక్ట్స్, ఇతర సౌకర్యాలు వున్నప్పటికీ అవి సమర్థవంతంగా పనిచేయవు.

పైగా.. సూర్యునితాపంతో చెమట అధికంగా రావడంతో దాన్నుంచి చర్మానికి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇన్ని చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చర్మాన్ని ఈ వేసవితాపం నుంచి రక్షించుకోవాలంటే కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకోవాల్సిందిగా వారు సూచిస్తున్నారు. ఆ హెల్దీ ఆహారాలేంటో తెలుసుకుందాం...

* టమోటా : ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన ఔషధగుణాలు దాగి వున్నాయని అందరికీ తెలిసిందే! అలాగే చర్మాన్ని రక్షణ కల్పించే పోషకాలు కూడా ఇందులో వుంటాయి. టమోటాలో లైకోపిన్ అనే కంటెంట్ వుంది. ఇది చర్మం సంరక్షణకు చాలా అవసరం. ఇది ముఖంలో ముడతలు తగ్గించి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. వేసవిలో టమోటా జ్యూస్ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్ డైట్ లో టమోటా తీసుకుంటే ఆరోగ్యంతోపాటు సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

* సాల్మన్ ఫిష్ : సమ్మర్లో సాల్మన్ ఫిష్ తీసుకుంటే చర్మం చాలా హెల్దీగా వుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని నిర్జీవ కణాలను తొలిగించి, చర్మాన్ని ఫ్రెష్ గా చేస్తాయి. అలాగే.. చర్మసౌందర్యాన్ని కూడా పెంచుతాయి. కాబట్టి.. ఈ సాల్మన్ ఫిష్ రిసిపీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చర్మరక్షణకు చాలా శ్రేయస్కరం.

* బెర్రీస్ : వీటిల్లో యాంటీఆక్సిడెంట్స్ అధిక మోతాదులో నిల్వ వుంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాదు.. యూవి కిరణాల వల్ల స్కిన్ డ్యామేజ్ నివారించడంలో ఇవి అద్భుతంగా సహాయపడుతాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

* వేసవిలో చర్మాన్ని కాంతివతంగా, ప్రకాశవంతంగా మార్చుకోవాలంటే.. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా ప్రకాశావంతంగా మార్చడంలో కొల్లాజెన్ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beauty Tips  Skincare tips  Healthy foods  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more